అన్న క్యాంటిన్లో తింటూ చదువుకున్న ఓ పేదింటి బిడ్డ ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. మెగా డిఎస్సి విజేత మీసాల రవికుమార్ సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Telugu student Success Story : కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. లక్ష్యం వైపు సాగించే ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురుకావచ్చు...వాటికి తలొగ్గితే కల కలగానే మిగిలిపోతుంది. ఎన్ని కష్టాలొచ్చినా కన్నీటిని దిగమింగుకుంటూ అయినా అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టకూడదు. ఇదే చాలామంది విజేతల సక్సెస్ సీక్రెట్. ఇలాంటి జర్నీయే ఆంధ్ర ప్రదేశ్ మెగా డిఎస్సి ర్యాంకర్ మీసాల రవికుమార్ ది కూడా.
DID YOU KNOW ?
మెగా డిఎస్సి
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల కోసం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించింది.
25
అనుకున్నది సాధించేశాడుగా...
మద్యతరగతి కుటుంబంలో పుట్టిన రవికుమార్ చిన్నప్పటినుండి జీవితంలో ఏదైనా సాధించాలని కలగనేవాడు. ఇలా చదువుకునే సమయంలో తన లక్ష్యాన్ని వెతుక్కునేవాడు... చివరకు అతడు మంచి క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఆ దిశగా అతడి ప్రయాణం సాగింది.. తనలాంటి పేద మద్యతరగతి చిన్నారులను క్రీడాకారులుగా తయారుచేయాలని ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడు రవికుమార్.
ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో రవికుమార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడిగా జాబ్ సాధించాడు. ఈ విభాగంలో ఒకటి కాదు ఏకంగా మూడు టీచర్ ఉద్యోగాలను పొందాడు. ఇలా అనుకున్నది చాలా గొప్పగా సాధించాడు రవికుమార్... నేటి యువతకు ఆదర్శంగా నిలిచే అతడి సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం.
35
డిఎస్సి విజేత రవి కుమార్ సక్సెస్ స్టోరీ
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడుకి చెందిన మీసాల రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలగనేవాడు. ఇందుకోసం అతడు కష్టపడేవాడు... ఇటీవల అతడి కల నెరవేరింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో రవికుమార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ జాబ్ పొందాడు. కేవలం ఒకటి కాదు ఏకంగా మూడు ఉద్యోగాలను సాధించాడు రవికుమార్.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదలచేసిన డిఎస్సి పలితాలలో రవికుమార్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో జిల్లాస్థాయి 19వ ర్యాంకు సాధించాడు. అంతేకాదు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ జోనల్ స్థాయిలో 25వ ర్యాంకు సాధించాడు. ఇక ఎస్జిటి (Secondary Grade Teacher) కేడర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కేటగిరీలో జోనల్ స్థాయి 35వ ర్యాంకు సాధించాడు. ఈ మూడిట్లో ఏదో ఒక ఉద్యోగాన్ని అతడు ఎంపిక చేసుకోనున్నాడు.
అన్న క్యాంటిన్ లో తిని ఈ ఉద్యోగాలు సాధించా..: రవికుమార్
సక్సెస్ ఫుల్ గా ప్రభుత్వ టీచర్ జాబ్ సాధించిన రవికుమార్ తాజాగా తన ప్రిపరేషన్ గురించి వివరించాడు. ఉద్యోగానికి సన్నద్దమయ్యే సమయంలో తన ఆర్థిక కష్టాలు ఈ అన్న క్యాంటిన్ ద్వారా కొంత తగ్గాయని తెలిపాడు. తన ఆకలితీర్చిన అన్న క్యాంటిన్ గురించి అతడు చాలా గొప్పగా చెప్పకొచ్చాడు.
స్పోర్ట్స్ మీద ఉన్న మక్కువ, విద్యార్థులకు మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ ప్రొఫెషన్ ను ఎచుకున్నానని రవికుమార్ తెలిపాడు. కూటమి (టిడిపి, జనసేన, బిజెపి పార్టీలతో కూడిన) ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేసిందని... దీంతో ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రైవేట్ ఉద్యోగాన్ని మానేసి గట్టిగా ప్రిపేర్ అయ్యానని తెలిపాడు. అప్పటివరకు చేసిన ఉద్యోగం మానేయడం, ప్రిపరేషన్ సమయంలో ఖర్చులతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు రవికుమార్ తెలిపారు.
55
ఓ కుర్రాడి విజయంలో అన్న క్యాంటీన్ ప్రాత...
డిఎస్సి ప్రిపరేషన్ లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి లోనయ్యాను.. ఈ సమయంలోనే అన్న క్యాంటిన్ తన ఆకలిబాధను తీర్చాయని రవికుమార్ పేర్కొన్నాడు. ఉదయం, సాయంత్రం అన్న క్యాంటిన్ లో ఆకలి తీర్చుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాను... ఇవి తన ఫైనాన్షియల్ ఒత్తిడిని కొంతమేర తగ్గించాయన్నారు. ఇలా తన విజయంలో అన్న క్యాంటిన్ల పాత్ర మరిచిపోలేనిదని రవికుమార్ చెప్పుకొచ్చారు.