సమ్మర్ క్యాంపు లో పిల్లల అభిరుచి బట్టి రకరకాల ఆక్టివిటీస్ ఉంటాయి .వంట నేర్పడం ఇందులో ఒకటి .వంట సృజనతో కూడినది .వంట నేర్చుకోవడం వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది . టీం వర్క్ అలవాటు అవుతుంది. చిన్న వయసులోనే... అందునా అబ్బాయిలకు సైతం వంట నేర్పడం మంచి పని . టమాటో స్కూల్ సింగపూర్ సమ్మర్ క్యాంపు 3 మార్చ్ నాడు మొదలయ్యింది .మే 16 దాక కొనసాగాల్సి ఉంది.
ఆరు నుంచి 14 ఏళ్ళ పిల్లలకు ఈ ఈస్టర్ కుక్కింగ్ క్యాంపు నిర్వహిస్తున్నారు .
సోమవారం -- బన్స్ , బన్నీస్ , బ్రౌనీస్.
మంగళవారం - wraps లేమోనెడ్
బుధవారం - పిజ్జా
గురువారం - పాన్ కేక్ సిన్నమోన్ రోల్స్
శుక్రవారం . కప్ కేక్
వారం లో ఒక్కో రోజు ఒక్కో వంటకం నేర్పుతారు . ఫీజు సుమారు గా నలబై వేల రూపాయిలు .వేసవి లో సింగపూర్ చూసినట్టు ఉంటుంది .
ప్రపంచం లోని భిన్న సంస్కృతుల పిల్లలతో మమేకం అయినట్టు ఉంటుంది . కాస్త డబ్బున్న కుటుంబాల తల్లితండ్రులు దీని వైపు ఆకర్షితుల కావడం సహజం .నిన్న కుకరీ క్లాసులో భాగంగా ఈస్టర్ ఎగ్ సలాడ్ శాండ్విచ్ చేసారు . ఇందులో భాగంగా పిలల్లు కోడి గుడ్లను
ఉడక బెట్టాలి .సింగపూర్ లో జరుగుతున్న నాలుగు సమ్మర్ క్యాంప్స్ లో రివర్ వాలీ రోడ్ లో ఉన్న షాపుహౌస్ అనే చోట అగ్ని ప్రమాదం జరిగింది .
అగ్ని ప్రమాదానికి కారణం ఇది అని ఇంకా అధికారులు ప్రకటించలేదు .