Published : Apr 08, 2025, 10:09 PM ISTUpdated : Apr 08, 2025, 10:12 PM IST
ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్దకొడుకు అకీరా నందన్ పుట్టినరోజునేే చిన్నకొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్ లో ఓ సమ్మర్ క్యాంప్ మార్క్ శంకర్ ఉండగా అగ్నిప్రమాదం జరిగింది... దీంతో ఇతడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యాడు. పవన్ తో పాటు చిరంజీవి దంపతులు సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తన కొడుకుతో పాటు మిగతా పిల్లలను కాపాడింది ఎవరో పవన్ వెల్లడించారు. వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రమాదానికి గురయ్యాడు. పవన్ భార్య అన్నా లెజినోవా కొడుకుని సమ్మర్ క్యాంప్ కోసం సింగపూర్ తీసుకెళ్లింది. ఈ క్రమంలో మార్క్ శంకర్ స్కూల్లో ఉండగా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పవన్ తనయుడితో పాటు మిగతా విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిలో ఓ చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా చాలామంది గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో మార్క్ శంకర్ కూడా ఉన్నాడు.
సింగపూర్ రివర్ వ్యాలీ షాప్ హౌస్ లో ఇవాళ(మంగళవారం) ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉదయం 9-10 గంటల మధ్య చిన్నారుల సమ్మర్ క్యాంప్ కొనసాగుతున్న భవనంలో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు మొదలై దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. మొదట ఈ ప్రమాదం చిన్నదేనని భావించిన పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లా పర్యటనను యధావిధిగా కొనసాగించారు... కానీ కొడుకు గాయాలతో హాస్పిటల్లో చేరినట్లు తెలిసిన ఆయన సింగపూర్ కు బయలుదేరి వెళ్లారు.
సింగపూర్ కు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ తన చిన్నకొడుకు ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ప్రస్తుతానికి మార్క్ శంకర్ కు ఎలాంటి ప్రమాదం లేదని... హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అతడి చేతికి, కాళ్ళకు గాయాలయ్యాయని... పొగ పీల్చుకోవడం వల్ల అది ఊపిరితిత్తుల్లోకి చేరిందని అన్నారు. దీంతో వైద్యులు బ్రాంకోస్కొఫీ చేస్తున్నారని పవన్ తెలిపారు.
23
Pawan Kalyan son Mark Shankar
పవన్ కొడుకుతో సహా పిల్లలందరినీ కాపాడింది వారే :
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకొడుకు మార్క్ శంకర్ ను కాపాడింది సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కాదు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఓ నిర్మాణం జరుగుతోందని... అక్కడ పనిచేసే కార్మికులే మొదట సహాయక చర్యల్లో పాల్గొన్నారని పవన్ తెలిపారు.
''చిన్నారుల క్యాంప్ కొనసాగుతున్న భవనంలో ఒక్కసారిగా పెద్దశబ్దంతో మంటలు మొదలయ్యాయి. నల్లటి పొగలు కమ్ముకున్నాయి. లక్కీగా ఈ భవనం పక్కనే నిర్మాణపనులు జరుగుతున్నాయి. అక్కడ పనిచేసే నిర్మాణ కార్మికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ఈ నిర్మాణ కార్మికులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను'' అని పవన్ అన్నారు.
తన కొడుకు మార్క్ శంకర్ చెయ్యి, కాలికి గాయాలయ్యాయని... కానీ అతడి పక్కనున్న పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని పవన్ తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 30 మంది చిన్నారులు ఉన్నారని... వారిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందంటూ విచారం వ్యక్తం చేసారు. తన కొడుకు బాగా పొగ మింగాడని... అతడికి ప్రస్తుతం బ్రాంకోస్కొపీ చేస్తున్నారని పవన్ తెలిపారు.
33
Pawan Kalyan son Mark Shankar
ఏమిటీ బ్రాంకోస్కోఫీ?
పవన్ కల్యాణ్ చిన్నకొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో చికిత్స పొందుతున్నాడు. అతడి కాలిన గాయాలకు చికిత్స అందించడంతో పాటు పొగ పీల్చడంవల్ల ఊపిరిత్తిత్తుల్లో ఏదయినా సమస్య ఏర్పడిందేమోనని వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తన కొడుకుకు వైద్యులు బ్రాంకోస్కొఫీ చేస్తున్నారని పవన్ తెలిపారు.
బ్రాంకోస్కోఫీ అంటే ముక్కు లేదా నోటిద్వారా కెమెరాతో కూడిన చిన్న పైపును ఊపిరితిత్తుల్లోకి పంపిస్తారు. ఇది ఊపిరితిత్తుల పనితీరును తెలియజేస్తుంది. ఊపిరితిత్తుల్లో ఏదయినా సమస్య ఉంటే ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ టెస్ట్ చేయడానికి దాదాపు గంటసేపు పడుతుంది... మార్క్ శంకర్ చిన్నపిల్లాడు కాబట్టి మరింత జాగ్రత్తగా ఈ టెస్ట్ చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి మరింత ఎక్కువ సమయం పడుతుంది.
ఈ టెస్ట్ రిజల్ట్ వస్తేనే పవన్ తనయుడి పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. కాలిన గాయాల పరిస్థితి ఏంటి? ఎంతశాతం కాలాయి? ఏ చికిత్స అందిస్తున్నారు? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ బయలుదేరారు. వారు అక్కడికి చేరుకున్నాక మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.