School Holidays
Sankranti Holidays : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలయ్యింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పట్నాలు, పల్లెలు సంక్రాంతి సంబరాలకు సిద్దం అవుతున్నాయి. పండక్కి ఇంకా నాలుగైదు రోజుల సమయం వుంది... కానీ ఇప్పట్నుంచే సొంతూళ్లకు వెళ్ళేవారిలో హడావిడి మొదలయ్యింది. పిల్లలకు ఇలా సెలవులు స్టార్ట్ కాగానే అలా ఊళ్లలో వాలిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇండియన్ రైల్వేస్ తో పాటు, తెలంగాణ, ఏపీ ఆర్టిసిలు బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల రద్దీగా అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
ఎలాగూ పండగవేళ విద్యాసంస్థలకు సెలవులు వుంటాయి... కాబట్టి ఇప్పుడే స్కూళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇవాళ, రేపు (బుధ,గురువారం) ప్రైవేట్ పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, విద్యార్థులు రంగురంగుల ముగ్గులతో స్కూల్ ప్రాంగణాన్ని అలంకరించుకోనున్నారు. సాంప్రదాయ వస్త్రాల్లో తెలుగుదనం ఉట్టిపడేలా రెడీ అయి ఆటాపాటలతో సంబరాలు జరుపుకోనున్నారు.
ఇలా రేపు ఒక్కరోజే స్కూళ్లు నడవనున్నాయి... ఎల్లుండి (జనవరి 10, శుక్రవారం) నుండి పది రోజులపాటు స్కూళ్ళు బంద్ కానున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పలు విద్యాసంస్థలకు శుక్రవారం నుండే సంక్రాంతి సెలవులు ప్రారంభంకానున్నాయి. ఏపీలో జనవరి 10 నుండే సెలవులు ప్రారంభం...కానీ తెలంగాణలో జనవరి 11 నుండి సెలవులు ప్రారంభం అవుతాయి. కానీ జనవరి 10న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కొన్ని స్కూళ్లకు సెలవు ఇచ్చారు. అలాంటి విద్యాసంస్థల్లో చదివే తెలంగాణ విద్యార్థులకు కూడా జనవరి 10 నుండే సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.
అయితే ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే ఆ జిల్లాల్లో రేపు (గురువారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశాలుంటాయి. అంటే ఆ జిల్లాల విద్యార్థులకు ఓరోజు ముందుగానే సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
School Holidays
ఏపీకి వర్షసూచన ... ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులుండే అవకాశం
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ వర్షాలు ప్రారంభంకానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశాలన్నాయి. వర్షాలు కురిసే అవకాశం వున్న జిల్లాలో స్కూళ్లకు రేపు (జనవరి 9న) సెలవు ప్రకటిస్తే ఆ తర్వాతి రోజునుండి సంక్రాంతి సెలవులే వుంటాయి. అంటే జనవరి 10 నుండి కాదు జనవరి 09 నుండే ఆ జిల్లాల విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతాయన్నమాట.
భూమధ్యరేఖకు ఆనుకుని వున్నహిందూ మహాసముద్రం, దానికి సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం నుండి కేరళ తీరం వరకు అల్పపీడనం నెలకొని వుంది. ఇదే పరిస్థితి అరేబియా సముద్రంలోనూ వుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలా భారతదేశం చుట్టూ వున్న సముద్రాల్లో నెలకొన్న అల్పపీడన పరిస్థితుల కారణంగా తమిళనాడు, పుదుచ్చెరితో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.
జనవరి 9న నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. ఈ జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయి వుంటుంది. అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయంలో పొగమంచు కురవడంతో పాటు చలి తీవ్రత ఎక్కువగా వుంటుంది.
ఈ వర్షతీవ్రత మరీ ఎక్కువగా వుంటే ఆ ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించే అవకాశం వుంది. ఇదే జరిగితే అక్కడి విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఓ రోజు ముందుగానే రానున్నాయి... రాష్ట్రంలోని అన్నిస్కూళ్లకు వరుసగా 10 రోజుల సెలవవుంటే ఇక్కడ మాత్రం వర్షం కారణంగా ఓ సెలవు అదనంగా రానుంది. అంటే 11 రోజులు సంక్రాంతి సెలవులు వస్తాయన్నమాట.
school holidays
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు :
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఇక్కడి తెలుగు ప్రజలు సంక్రాంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు.మూడు రోజులపాటు జరిగే పండగిది. ఓరోజు భోగి, మరోరోజు సంక్రాంతి, ఇంకోరోజు కనుమ వుంటుంది. ఈ పండక్కి ఎక్కడెక్కడో స్థిరపడినవారంతా తమ సొంతూళ్లకు వస్తుంటారు. భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, గంగిరెద్దులు, కోడి పందేలు, పిండివంటలు... ఇలా తెలుగు లోగిళ్లు సంక్రాంతి పండగవేళ కళకళలాడుతాయి.
అయితే ప్రతిసారిలా లాకుండా ఈ సంక్రాంతికి కూటమి ప్రభుత్వం సెలవులు కుదించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నట్లు పదిరోజులు కాకుండా కేవలం ఐదురోజులే విద్యాసంస్థలకు సెలవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం అలాంటి ఆలోచనేమీ లేదంటూ పదిరోజుల సెలవులు ప్రకటించింది. జనవరి 10 నుండి 19 వరకు సెలవులు వుంటాయని క్లారిటీ ఇచ్చారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే విద్యాసంస్థలకు ఏడురోజులు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ముందుగా జనవరి 13 నుండి జనవరి 17 వరకు అంటే ఐదురోజులే సెలవులు ఇవ్వనున్నట్లు అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. కానీ జనవరి 11 రెండో శనివారం, జనవరి 12న ఆదివారం రెండ్రోజులు సెలవు వుంది. కాబట్టి జనవరి 11 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించారు. ఇలా వారం రోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
ఏపీకి మళ్ళీ వర్షాలు.. రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం
Sankranti Holidays : తెలంగాణలోనూ ఆ స్కూళ్లకు పదిరోజుల సంక్రాంతి సెలవులు ... వచ్చే శుక్రవారం నుండే షురూ
2025లో సెలవులే సెలవులు : వచ్చేవారం నుండి వరుస లాంగ్ వీకెండ్స్, ఎన్నో తెలుసా?