Fake Universities in India : మీ పిల్లలను ఈ యూనివర్సిటీల్లో చేర్చకండి... ఇక్కడ చదివారో కెరీర్ నాశనమే!

First Published | Jan 7, 2025, 9:06 PM IST

ప్రస్తుతం విద్య అనేది ఓ వ్యాపారంగా మారింది. పిల్లలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంత ఖర్చయినా సరే వారిని చదివించేందుకు వెనకాడటం లేదు. ఇదే కొందరు అక్రమార్కులు వ్యాపారంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో దేశంలో ఏకంగా ఫేక్ యూనివర్సటీలు పుట్టుకువస్తున్నాయి. ఇలాంటి ఫేక్ యూనివర్సిటీల గురించి తెలుసుకుందాం. 

Fake Universities in India

Fake Universities in India : మంచి పేరున్న విద్యాసంస్థలో చదువుకోవాలని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల చదువుకోసం ఎంతయినా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. ఇది పసిగట్టిన కొందరు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ విద్యను వ్యాపారంగా మార్చేసారు. ఎలాంటి అనుమతులు లేకుండానే యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారు... ఈ పేరుతో యువతను మోసగిస్తున్నారు. 

ఇలా దేశవ్యాప్తంగా యువతను మోసగిస్తున్న  నకిలీ యూనివర్సిటీల భరతం పట్టేందుకు UGC (యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్) సిద్దమయ్యింది. ఇందులో భాగంగా దేశంలోని ఫేక్ యూనివర్సిటీల లిస్ట్ ను రెడీ చేసింది. యూనివర్సిటీ పేరిట యువతను మోసం చేస్తున్న ఈ నకిలీ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది యూసిసి. ఈ మేరకు రాష్ట్రాల ఉన్నత విద్యాశాఖకు లేదా ప్రిన్సిపల్ సెక్రెటరీలకు UGC లేఖ రాసింది. 

అయితే యూజిసి ప్రకటించిన ఫేక్ యూనివర్సిటీల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రెండు విద్యాసంస్థలు వున్నాయి. ఈ రెండు విద్యాసంస్థలు యూనివర్సిటీలుగా చెలామణి అవుతున్నాయి...కానీ వీటికి యూజిసి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. వీటికి డిగ్రీలు అందించే అధికారం లేదు... ఇక్కడినుండి సర్టిఫికెట్లు పొందినా అవి నకిలీవిగానే పరిగణించబడతారు. 

Unnati Scholarship Scheme for students

ఆంధ్ర ప్రదేశ్ లోని నకిలీ యూనివర్సిటీలు : 

యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్సిటీలు వున్నాయి. వీటిలో రెండు ఆంధ్ర ప్రదేశ్ లో వున్నాయి. ఈ ఫేక్ యూనివర్సిటీల్లో ఒకటి గుంటూరులో వుంటే మరొకటి ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో వుంది. 

1. క్రీస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ :

గుంటూరులోకి క్రీస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీకి తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని UGC ప్రకటించింది. యూనివర్సిటీ అర్హతలేమీ లేకున్నా ఈ విద్యాసంస్థ యువతను మోసం చేస్తోందన్నమాట. అందువల్లే ఈ ఫేక్ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరింది యూజిసి. 

ఈ ఫేక్ యూనివర్సిటీ గుంటూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది. కాకుమానువారితోట, 7వ లైన్, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, 522002 అడ్రస్ తో పాటు ఫ్లాట్ నంబర్ 301, గ్రేస్ విల్లా అపార్ట్ మెంట్, శ్రీనగర్, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, 522002 మరో అడ్రస్ తో ఈ క్రీస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ కొనసాగుతున్నట్లు UGC ప్రకటించింది.  

2. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా : 

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఫేక్ యూనివర్సిటీని విశాఖపట్నంలో గుర్తించింది యూజిసి. ఉత్తరాంద్ర ప్రాంత ప్రజలను యూనివర్సిటీ పేరిట మోసం చేస్తున్న ఈ విద్యాసంస్థపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 

విశాఖపట్నంలోని ఎన్జివో కాలనీలో హౌస్ నంబర్ 49-35‌-26 అడ్రస్ లో ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా పేరిట ఫేక్ యూనివర్సిటీ కొనసాగుతోంది. దీనిని యూనివర్సిటీగా UGC గుర్తించనేలేదట... కానీ యూనివర్సిటీ పేరిట చెలామణి అవుతోంది. ఇది నిజమేనని నమ్మి ఈ విద్యాసంస్థలో చేరి యువత మోసపోతున్నారు.  

ఇలా ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ఫేక్ యూనివర్సిటీలు నడుస్తున్నట్లు యూజిసి గుర్తించింది. కాబట్టి తమ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వుండాలి... విద్యాసంస్థల ఎంపిక విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అన్ని అనుమతులు వున్నాయా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఇలాంటి ఫేక్ విద్యాసంస్థల చేతుల్లో మోసపోవాల్సి వస్తుంది...డబ్బులు డబ్బు పోవడమే కాదు కాదు మీ పిల్లల విలువైన సమయం వృధా అవుతుంది, కెరీర్ నాశనం అవుతుంది. 
 


దేశంలోని మొత్తం నకిలీ యూనివర్సిటీలివే : 

కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా ఇంకా చాలా నకిలీ విశ్వవిద్యాలయాలున్నాయి. వాటన్నింటిని గుర్తించిన యూజిసి అధికారికంగా ప్రకటించింది. ఇలా యూజిసి ప్రకటించిన నకిలీ యూనివర్సిటీల్లో అత్యధికం దేశ రాజధాని డిల్లీలోనే వున్నాయి... అక్కడ మొత్తం 8 నకిలీ యూనివర్సిటీలు వున్నాయి. అవి ఇవే. 

1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆప్ పబ్లిక్ ఆండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (AIIPHS) స్టేట్ యూనివర్సిటీ

అడ్రస్ : ఆఫీస్ నం.608-609, 1వ అంతస్తు, సంత్ కృపాల్ సింగ్ పబ్లిక్ ట్రస్ట్ బిల్డింగ్, బిడివో దగ్గర,అలిపూర్, డిల్లీ. 110036.

2. కమర్షియల్ యూనివర్సిటి లిమిటెడ్. ధర్యాగంజ్, డిల్లీ. 

3. యునైటెడ్ నేషనల్ యూనివర్సిటీ, డిల్లీ. 

4. వొకేషనల్ యూనివర్సిటీ,డిల్లీ 

5. ఏడిఆర్-సెంట్రిక్ జుడిషియల్ యూనివర్సిటీ, ఎడిఆర్ హౌస్, 8జె, గోపాల్ టవర్, 25 రాజేంద్ పాలస్, న్యూడిల్లీ. 110008.

6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆండ్ ఇంజనీరింగ్, న్యూడిల్లీ

7. విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్, రోజ్ గార్ సేవాసదన్, 672, సంజయ్ ఎన్ క్లేవ్, జిటికె డిపో ఎదురుగా, డిల్లీ. 110033

8. ఆద్యాత్మిక్ విశ్వవిద్యాలయం (స్పిరిచువల్ యూనివర్సిటీ), 351-352, ఫేజ్-1, బ్లాక్ ఏ, విజయ్ విహార్, రితాల,రోహిని,డిల్లీ.110085

కర్ణాటకలో ఫేక్ యూనివర్సిటీ : 

1. భదగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, గోకక్, బెల్గాం,కర్ణాటక

కేరళలోని నకిలీ యూనివర్సిటీలు : 

1.సేంట్ జోన్స్ యూనివర్సిటీ, కిశనట్టమ్, కేరళ. 

2. ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ (IIUPM), కన్నమంగళమ్ కోజికోడ్, కేరళ. 673571

మహారాష్ట్రలోని నకిలీ యూనివర్సిటీలు : 

రజ అరబిక్ యూనివర్సిటీ, నాగ్ పూర్, మహారాష్ట్ర 

పుదుచ్చెరిలోని ఫేక్ యూనివర్సిటీలు : 

శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నంబర్.186, థిలస్పేట్, విజుథావూర్ రోడ్, పుదుచ్చెరి. 605009

ఉత్తర ప్రదేశ్ లో నకిలీ యూనివర్సిటీలు : 

1. గాంధి హింది విద్యాపీఠ్, ప్రయాగ్, అలహాబాద్, ఉత్తర ప్రదేశ్ 

2. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ), అచల్తల్, అలిఘర్, ఉత్తర ప్రదేశ్

3. భారతీయ శిక్షా పరిషద్, భారత్ భవన్, మతియారి చిన్హట్, ఫైజాబాద్ రోడ్, లక్నో, ఉత్తర ప్రదేశ్. 227105

4.మహామయ టెక్నికల్ యూనివర్సిటీ, మహారిషి నగర్, జిల్లా. జిబి నగర్, సెక్టార్ 110 ఎదురుగా, సెక్టార్ 110,నోయిడా. 201304

పశ్చిమ బెంగాల్ లోని ఫేక్ యూనివర్సిటీలు : 

1. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆప్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, కోల్ కత్తా. 

2. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఆండ్ రీసెర్చ్,8-A, డైమండ్ హార్బర్ రోడ్, బుల్టెక్ ఇన్, 2వ అంతస్తు, థాకుర్పుర్కుర్, కోల్ కత్తా. 700063. 

ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 21 ఫేక్ యూనివర్సిటీలు వున్నాయి. ఇందులో అత్యధికంగా 8 న్యూడిల్లీలో వుండగా ఉత్తర ప్రదేశ్ లో 4, ఆంధ్ర ప్రదేశ్ లో 2, పశ్చిమ బెంగాల్ లో 2, కేరళ, మహారాష్ట్ర,పుదుచ్చెరి, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కో ఫేక్ యూనివర్సిటీలు వున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని... ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా విద్య పేరిట మోసానికి పాల్పడుతున్న ఈ ఫేక్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని యూజిసి సూచించింది. 

Latest Videos

click me!