నవంబర్ 23న సెలవు... ఎందుకో తెలుసా?
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి... అయితే వివిధ కారణాలతో కొన్ని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక్కడ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసి నోటిఫికేషన్ జారీ చేసింది... ఇప్పటికే మొత్తం 23 చోట్ల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యింది.
నవంబర్ 23న అంటే వచ్చే సోమవారం వివిధ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడి ఉద్యోగులకు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ పోలింగ్ రోజు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇలా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నవంబర్ 23న సెలవు ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి... దీంతో సెలవులు ప్రకటన వెలువడింది.
కేవలం ఉద్యోగులకే కాదు విద్యార్థులకు కూడా నవంబర్ 23న సెలవు ఉండనుంది. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసేది ప్రభుత్వ పాఠశాలల్లోనే... కాబట్టి అక్కడ చదివే విద్యార్థులకు సెలవు ఉంటుంది. ఇలా మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వచ్చే సోమవారం ప్రత్యేక సెలవు ఉంది.
మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాలివే..
మున్సిపల్ కార్పోరేషన్లు : శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి , మంగళగిరి-తాడేపల్లి
మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు : ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, బీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, నరసరావుపేట, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట, బాపట్ల
ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ నగరాలు, పట్టణాల్లో నవంబర్ 23న పోలింగ్ జరగనుంది... కాబట్టి ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు వర్తిస్తుంది.