ఎన్నికల సంగతి అలా ఉంటే, బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను రాష్ట్రంలో పలు జిల్లాలను వణికిస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వీటితో పాటు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక కలెక్టర్లు పరిస్థితులను బట్టి బడులకు హాలిడేస్ ఇస్తున్నారు.