Sankranti Holidays
Sankranti Holidays : సెలవులు... ఈ మాట వింటేచాలు స్కూల్ పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఆదివారం సెలవుకే మురిసిపోయే పిల్లలు పండగలు, ప్రత్యేక రోజులు, బంద్ ల వల్ల ఎప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. అయితే కొన్ని సెలవులు పిల్లలకు చాలా ప్రత్యేకమైనవి... అందులో కీలకమైనవి దసరా, సంక్రాంతి హాలిడేస్. వేసవి తర్వాత విద్యాసంస్థలకు ఎక్కువరోజుల సెలవులు వచ్చేది ఈ రెండు పండగలకే. అందుకే ఈ ఫెస్టివల్స్ వచ్చాయంటే చాలు స్కూల్ విద్యార్థుల ఆనందానికి అవధులుండవు.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగలంటే దసరా, సంక్రాంతి. తెలంగాణలో దసరాను, ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. ఇందుకు తగ్గట్లుగానే దసరాకు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలను ఎక్కువరోజుల సెలవులు ఇస్తారు. అలాగే సంక్రాంతికి ఏపీలో అధికంగా సెలవులు ఇస్తారు.
అయితే ఈసారి సంక్రాంతి పండగ దగ్గరపడింది... దీంతో ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు సెలవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై చంద్రబాబు సర్కార్ నీళ్లు చల్లేలా కనిపిస్తోంది. ఎప్పటిలా కాకుండా ఈ సంక్రాంతికి చాలా తక్కువగా సెలవులు ఇవ్వాలన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది. కేవలం ఐదురోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇవ్వాలని చూస్తున్నారట... ఇందులో ఓ ఆదివారం కూడా వుంది. అంటే పండక్కి ఇచ్చే సెలవులు కేవలం నాలుగేరోజులు. ఈ సెలవులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని సమాచారం.
Sankranti Holidays
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ 2024-25 లో సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులు ఇవ్వనుందో ప్రకటించింది. 2025లో సంక్రాంతి పండక్కి జనవరి 10 నుండి 19 వరకు స్కూళ్ళకు సెలవులు వుంటాయని ఎప్పుడో ప్రకటించారు. దీంతో పదిరోజుల సెలవులను ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చని విద్యార్థులు భావించారు.
అయితే సంక్రాంతి పండక్కి సమయం దగ్గరపడ్డ సమయంలో ప్రభుత్వం సెలవుల విషయంలో మాటమార్చేలా కనిపిస్తోంది. పదిరోజులు కాదు కేవలం ఐదురోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు ఇవ్వాలని సర్కార్ భావిస్తోందట. జనవరి 10 నుండి 19 వరకు కాదు కేవలం జనవరి 11 నుండి 15 లేదా జనవరి 12 నుండి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం వున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సంక్రాంతి సెలవుల కుదింపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం... అధికారిక ప్రకటనే మిగిలిపోయిందట. సాధారణంగా సంక్రాంతి (బోగి, సంక్రాంతి,కనుమ) మూడురోజుల పండగ. కాబట్టి ఎలాగూ సెలవు ఇవ్వాల్సిందే. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన ప్రజలు సంక్రాంతి పండక్కి తమ సొంతూళ్ల వెళుతుంటారు... ఇందుకోసం ముందుగా ఒకటి రెండ్రోజులు సెలవులు ఇస్తున్నారు. ఇలా సంక్రాంతికి కేవలం ఐదురోజుల సెలవే కన్ఫర్మ్ అయితే మొదటిసారి అతి తక్కువరోజులు సెలవులు వస్తాయి.
Sankranti Holidays
ఎందుకు సంక్రాంతి సెలవుల కుదింపు :
గతకొన్ని సంవత్సరాలుగా ఎండాకాలంలోనే కాదు వర్షాకాలంలోనూ భారీగా సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ముందుగా మూసివేసేది విద్యాసంస్థలే. ఇలా 2024 లో కూడా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు దంచికొట్టాయి... దీంతో స్కూళ్లకా భారీగా సెలవులు వచ్చాయి.
ఇలా ఊహించని విధంగా స్కూళ్లకు సెలవులు రావడంతో విద్యార్థులు అకడమిక్ ఇయర్ లో చాలారోజులు కోల్పోయారు. అనుకున్న సమయానికి సిలబస్ పూర్తయ్యేలా కనిపించడంలేదు. అందువల్లే వర్షకాలంలో వచ్చిన సెలవులను భర్తీ చేసేందుకు సంక్రాంతి సెలవులను కుదించే ఆలోచనలో ప్రభుత్వం వుంది. అందువల్లే పదిరోజుల సంక్రాంతి సెలవులను ఐదు రోజులకు కుదించబోతోందట... మిగతా ఐదురోజులు స్కూళ్లు, కాలేజీలను యదావిధిగా నడిపించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
అయితే ఇలా సంక్రాంతి సెలవుల కుదింపు ఆలోచనపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి మిక్సుడ్ అభిప్రాయాలు వెలువడుతున్నారు. కొందరు రాష్ట్రంలోని పెద్ద పండగ సంక్రాంతికి ఇలా సెలవులు తగ్గించడమేంటని తప్పుబడితే... మరికొందరు తమ పిల్లల భవిష్యత్ కోసమేగా ఈ నిర్ణయం తీసుకున్నారంటూ మద్దతిస్తున్నారు. విద్యార్థులను మాత్రం సంక్రాంతి సెలవుల తగ్గింపు నిర్ణయం నిరాశపరిచే అవకాశం వుంది.
Sankranti Holidays
టెన్త్ విద్యార్థులకు కేవలం మూడ్రోజులే సంక్రాంతి సెలవులు..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవలే పదో తరగతి పరీక్షల తేదీలను వెల్లడించారు. మార్చి 17 నుండి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో మాదిరిగా వరుసగా పరీక్షలు నిర్వహించకుండా ఓ పరీక్ష నుండి మరో పరీక్షకు మద్యలో ఓ రోజు గ్యాప్ వుండేలా చూసారు. దీంతో విద్యార్థులకు చదువుకునేందుకు మరింత సమయం దొరుకుతుంది... కాబట్టి మెరుగైన ఫలితాలు వస్తాయన్నది ప్రభుత్వ ఆలోచనగా లోకేష్ తెలిపారు.
ఇలా పదో తరగతి విద్యార్థుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వుంది... ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చూడాలని... ఇదే సమయంలో మంచి రిజల్ట్ రాబట్టాలని ప్రయత్నిస్తోంది. అందుకోసమే పదో తరగతి విద్యార్థులకు కేవలం మూడురోజులే సంక్రాంతి సెలవులు (డిసెంబర్ 13,14,15) ఇస్తున్నారు. ఈ మూడ్రోజులు మినహా మిగతారోజుల్లో వారి ప్రిపరేషన్ యదావిధిగా కొనసాగనుంది.
ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన : స్కూళ్లు, కాలేజీలకు మూడ్రోజులు సెలవులేగా!
జనవరి 2025 లో స్కూళ్లు, కాలేజీలకు భారీ సెలవులు... ఎన్నిరోజులో తెలుసా?