ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఇసుక రవాణా యథేశ్చగా సాగుతోంది. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్,వరంగల్, ఖమ్మం, నల్గొండ, పాలమూర్ జిల్లాల్లో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వాలంటే…. టిజీఎండీసీ అనుమతులు అవసరం. ఇసుక కొనుగోళ్ల ప్రక్రియ అంతా టిజీఎండీసీ అద్వర్యంలో అది కూడా ఆన్ లైన్ లో జరగాలి. అయితే…. టిజిఎండీసీ వెబ్ సైట్‌లో ఓపెన్ కాకుండానే… చాలా చోట్ల ఇసుక తరలిపోతుంది. తెలంగాణలోని పలు చోట్ల ఇసుక రీచ్‌ల నుంచి వందల కొద్ది లారీల్లో ఇసుక తరలిపోతుంది.
దొంగ బిల్లుటు పెడుతూ, ఓవర్ లోడ్‌తో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణను అరికట్టేందుకు సీఎం ముందడుగు వేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకట్ట వేయాలని డిసైడ్ అయ్యారు. మరి రేవంత్ నిర్ణయంతో అయినా అక్రమ ఇసుక రవాణాకు బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.