GBS Outbreak: మరో మాయదారి రోగం.. ఏంటీ 'జీబీఎస్‌', లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published : Feb 15, 2025, 12:37 PM IST

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను వ్యాధులు భయపెడుతున్నాయి. ఇప్పటిబే బర్డ్‌ ఫ్లూతో భయపడుతోన్న ప్రజలను ఇప్పుడు మరో మాయదారి రోగం భయాందోళనకు గురి చేస్తోంది. గీయాన్‌ బరే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..   

PREV
14
GBS Outbreak: మరో మాయదారి రోగం.. ఏంటీ 'జీబీఎస్‌', లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

గీయాన్‌ - బరే సిండ్రోమ్‌ ఈ వ్యాధి మనకు కొత్త అయినా తొలిసారి ఈ ఏడాది జనవిలో మహారాష్ట్రలోని పుణెలో వెలుగు చూశాయి. ఒక్క వారం వ్యవధిలోనే అక్కడ వందల కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులు ఆంధ్రప్రదేశ్‌లోనూ నమోదవుతున్నాయి. ఇప్పటికే 17 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరం, విజయవాడ, అనంతపురం జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, కాకినాడలో 4, గుంటూరు, విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులను గుర్తించారు. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో కూడా ఒక కేసు నమోదైంది. 
 

24
gbs

ఇంతకీ ఏంటీ వ్యాధి.? 

జీపీఎస్‌ సిండ్రామ్‌ వ్యాధి అత్యంత అరుదుగా సంభవిస్తుంది. లక్ష మందిలో కేవలం ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారిలో రోగనిరోధక శక్తి నశిస్తుంది. ఒకరకంగా చెప్పాలంలో ఇది తీవ్రమైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్. శరీరాన్ని కాపాడాల్సిన రోగనిరోధక శక్తి పొరపాటున నరాలపై దాడి చేస్తుంది. ఇది కండరాల బలహీనత, తిమ్మిరి, కొన్నిసార్లు పూర్తి పక్షవాతానికి దారి తీస్తుంది. 

జీబీఎస్‌ ఎందుకు వస్తుందన్న దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ. బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ ఒక కారణమని అంచనా వేస్తున్నారు. Campylobacter jejuni అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది ఫుడ్‌ పాయిజనింగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాగా చెబుతున్నారు. మన శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటుగా నరాలను దాడి చేయడం వల్ల GBS వస్తుంది. ఇది మెదడు, వెన్ను పూసలోని నరాలపై ప్రభావం చూపుతుంది. 
 

34

లక్షణాలు ఏంటి.? 

జీబీఎస్‌ సోకిన వారిలో ప్రధానంగా కనిపించే లక్షణాలు ఇవే.. 

* పాదాలు, చేతుల్లో తిమ్మిరి అనిపించడం. క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. 

* కాళ్లలో సత్తువ కోల్పోతారు. క్రమంగా పై వరకు చేరుతుంది. 

* కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యకు దారి తీస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. కొన్ని సందర్భాల్లో వెంటిలేటర్‌ అవసరం కూడా వస్తుండొచ్చు. 

* జీబీఎస్‌ సోకితే నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో రక్తపోటులో హెచ్చుతగ్గులు, హృదయ స్పందనలో తీవ్రమైన మార్పులు ఏర్పడుతాయి. 

* నరాలకు సంబంధించిన వ్యాధి కావడంతో మాట్లాడడం, నమలడం, కంటి చూపులో సమస్యలు తలెత్తుతాయి. ఒక రకంగా చెప్పాలంటే పక్షవాతంలో కనిపించే లక్షణాలు ఇందులో కనిపిస్తాయి.

44

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? 

ఏదైనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌, ఫ్లూ లేదా డెంగ్యూ వంటి అనారోగ్యం బారిన పడిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పైన తెలిపిన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం 5గురు డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఇమ్యూనోగ్లోబిన్‌ అనే ఇంజక్షన్‌ ఇస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కోలుకున్న వారిలో 80 శాతం మంది ఈ ఇంజెక్షన్‌ అవసరం లేకుండానే రికవర్‌ అయ్యారని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories