Jobs : తెలుగు యువతకు బంపరాఫర్... ముఖేష్ అంబానీ కంపెనీలో ఉద్యోగాలే ఉద్యోగాలు

Published : Jun 27, 2025, 01:11 PM ISTUpdated : Jun 27, 2025, 10:48 PM IST

తెలుగు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే భారీ ప్రాజెక్టుతో దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ముందుకువచ్చారు. ఏపీలో భారీ పెట్టుబడులకు రిలయన్స్ సంస్థ సిద్దమవగా కూటమి ప్రభుత్వ అనుమతులు కూడా లభించాయి.   

PREV
15
ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు

Reliance : ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో నంబర్ వన్ గా ఉండాలని అనుకుంటారు. ఇలా టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసింది. ఇక పెట్రోలియం, పెట్రో కెమికల్స్, రిటైల్, టెక్స్ టైల్స్, మీడియా రంగాల్లోనూ తనదైన మార్కెటింగ్ స్ట్రాటజీతో దూసుకుపోతోంది రిలయన్స్. ఇప్పుడు శీతల పానియాల విభాగంలో భారీ పెట్టుబడులకు సిద్దమయ్యింది రిలయన్స్.

ప్రస్తుతం మార్కెట్ లో పెప్సీ, కోకాకోలా కంపనీలు ఈ కూల్ డ్రింక్స్ వ్యాపారాన్ని శాసిస్తున్నారు. వీటికి పోటీగానే రిలయన్స్ రంగంలోకి దిగింది. రాబోయే ఏడాది ఏడాదిన్నరలో దాదాపు రూ.8 వేల కోట్ల వరకు ఈ శీతల పానియాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని... ఇందుకోసం దేశవ్యాప్తంగా తయారీ, ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇలా రిలయన్స్ తీసుకున్న నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్ కు వరంగా మారింది.

25
ఆంధ్ర ప్రదేశ్ లో రిలయన్స్ భారీ పెట్టుబడులు

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ 2022 లో శీతల పానియాల వ్యాపారంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాంపా, సోస్యో వంటి సాప్ట్ డ్రింక్స్ తో పాటు స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్, సన్ క్రష్ జ్యూస్, ఇడిపెండెక్స్ వాటర్ బాటిల్స్ ను తయారుచేస్తోంది. వీటి ఉత్పత్తిని మరింత పెంచేందుకు, దక్షిణాదిన మార్కెట్ ను విస్తరించేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ లో నూతన ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమయ్యింది.

35
రిలయన్స్ ప్లాంట్ ఏర్పాటుకు కూటమి సర్కార్ అనుమతులు

ఇప్పటికే రిలయన్స్ సంస్థ ఏపీలో ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వ అనుమతులు కోరింది. శీతల పానియాలు, పండ్ల రసాలు తయారీ ప్లాంట్ ఏర్పాటుకోసం చేసిన ఈ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదించింది. ప్లాంట్ ఏర్పాటుకు భూమిని కేటాయిస్తూ ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు.

45
కర్నూల్ జిల్లాలో రిలయన్స్ ప్లాంట్

కర్నూల్ జిల్లా ఓర్వకల్లు దగ్గర ఈ రిలయన్స్ ప్లాంట్ ఏర్పాటుకు 80 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అలాగే రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ద్వారా భారీ పెట్టుబడులకు సిద్దమైన రిలయన్స్ సంస్థకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. ఇలా రిలయన్స్ డిసెంబర్ 2026 నాటికి ప్లాంట్ ఏర్పాటు పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించే అవకాశాలున్నాయి.

55
రిలయన్స్ ప్లాంట్ తో ఏపీ ప్రజలకు కలిగే లాభాలు

వ్యాపారరంగంలో పెట్టుబడులు రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి ఊతం ఇస్తాయి. ఇలా రిలయన్స్ పెట్టుబడులు కూడా ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అలాగే రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు ఉపయోగపడతాయి.

రిలయన్స్ సంస్థ ఓర్వకల్లులో శీతల పానియాల తయారీ, ప్యాకింగ్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1622 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఈ ప్లాంట్ ఏర్పాటుద్వారా దాదాపు 1200 మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగాల లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇక పరోక్షంగా మరెంతోమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని చంద్రబాబు సర్కార్ చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories