బాబుకు చుక్కలు చూపించిన కుప్పం: ఇదీ జరిగింది

First Published May 26, 2019, 1:33 PM IST

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో  2019 ఎన్నికల్లో  టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మెజారిటీ భారీగా తగ్గింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా  16 వేల ఓట్ల మెజారిటీ తగ్గిపోయింది. బాబు మెజారిటీ తగ్గడంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. వైసీపీకి కుప్పం నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడ ఆ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కల్గించింది.
 

1989 నుండి కుప్పం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు విజయం సాధిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో బాబు విజయం సాధిస్తున్నా... మెజారిటీలో తేడాలున్నాయి. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు.టీడీపికి కార్యకర్తల బలం ఉంది.
undefined
చంద్రబాబునాయుడు మెజారిటీని తగ్గించడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహన్ని కల్గించాయి. వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి రెండో దఫా పోటీ చేశాడు. 2009 ఎన్నికల్లో చంద్రబాబుకు 69 వేల మెజారిటీ వచ్చింది.
undefined
2014 ఎన్నికల్లో 69వేల మెజారిటీని 47,062 ఓట్లకు వైసీపీ తగ్గించింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 16 వేలు తగ్గింది. ఈ దఫా 30,273 ఓట్లకే బాబుకు వచ్చింది. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్ధి చంద్రమౌళి లేడు. అనారోగ్యం కారణంగా ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. అయినా కూడ వైసీపీ శ్రేణులు కసిగా పనిచేశాయి. దీంతో కుప్పంలో చంద్రబాబునాయుడు మెజారిటీ తగ్గింది.
undefined
కొత్త ఓటర్లు ఎక్కువగా జగన్‌ వైపు మొగ్గు చూపారు. పదేళ్లుగా వైసీపీలో నాయకత్వ సమస్య ఉంది. పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపై నడిపే నేతలు లేరు. సరైన నాయకుడు వైసీపీకి ఉంటే కుప్పంలో కూడ టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీ శ్రేణుల్లో జోష్‌ను నింపింది. ఈ ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో నిరాశను కల్గించింది. చాలా గ్రామాల్లో టీడీపీ వ్యతిరేక ఓట్లను వైసీపీ శ్రేణులు తమకు అనుకూలంగా మలుచుకొన్నాయి. ఈ పరిణామాలను టీడీపీ నాయకత్వానికి గుణ పాఠం నేర్పాయని విశ్లేషకులు చెబుతున్నారు.
undefined
click me!