ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఎవరు: జగన్ పరిశీలనలో వీరే...

First Published May 26, 2019, 12:44 PM IST

ఏపీ అసెంబ్లీకి కొత్త స్పీకర్ ఎవరనే విషయం సర్వత్రా చర్చ సాగుతోంది. ఏపీ అసెంబ్లీకి  స్పీకర్ పదవికి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలు కావడంతో..... స్పీకర్ పదవి ఎవరిని వరిస్తోందోననే ఆసక్తి నెలకొంది.
 

బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్పీకర్ పదవిని కట్టబెట్టాలని జగన్ యోచనలో ఉన్నారని వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. రేపల్లే నుండి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలయ్యాడు.
undefined
దీంతో స్పీకర్ పదవి కోసం వైసీపీ ఎమ్మెల్యేల పేర్లను జగన్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆనం రామనారాయణరెడ్డి, కోన రఘుపతి, అంబటి రాంబాబుల, గొల్ల బాబురావు పేర్లను స్పీకర్ పదవి కోసం జగన్ పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం సాగుతోంది.
undefined
శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుండి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించారు. ధర్మాన ప్రసాదరావు జగన్ కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో కళింగ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
undefined
ధర్మాన ప్రసాదరావు వెలమ సామాజిక వర్గానికి చెందినవాడు. తమ్మినేని సీతారాం కళింగ సామాజికవర్గానికి చెందినవాడు. సీతారాంకు స్పీకర్ పదవి... ధర్మానకు మంత్రి పదవి ఇస్తే రెండు సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటించినట్టుగా ఉంటుందని జగన్ భావనగా ఉందని వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
undefined
అంబటి రాంబాబు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును ఓడించాడు. అంబటి రాంబాబు కాపు సామాజికవర్గానికి చెందినవాడు. రాంబాబు మందచి వక్త. స్పీకర్ పదవి కంటే... పార్టీకి ఆయన సేవలను జగన్ ఉపయోగించుకొంటారని వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
undefined
ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్. అయితే అలాంటి ఆయనకు స్పీకర్ పదవి ఇవ్వకపోవచ్చని కూడ అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి స్పీకర్ పదవిని కట్టబెట్టే ఆలోచన జగన్‌కు లేదని చెబుతున్నారు.
undefined
బాపట్ల నుండి రెండో దఫా ఎన్నికైన కోన రఘుపతి పేరును కేబినెట్ పదవి కోసం జగన్ పరిశీలిస్తున్నట్టుగా వైసీపీ వర్గాల్లో ఉంది.బ్రహ్మణ సామాజిక వర్గం నుండి కోన రఘుపతి బాపట్ల నుండి విజయం సాధిస్తే...విజయవాడ సెంట్రల్ నుండి మల్లాది విష్ణు నుండి విజయం సాధించారు.
undefined
కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ రావు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1980-81లో స్పీకర్ పదవిని నిర్వహించాడు. దీంతో మంత్రి పదవితో పాటు స్పీకర్ పదవికి కూడ కోన రఘుపతి పేరును జగన్ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది.
undefined
పాయకరావుపేట నుండి విజయం సాధించిన గొల్ల బాబురావు మాజీ అధికారి. స్పీకర్ పదవికి బాబురావు పేరును జగన్ పరిశీలిస్తున్నట్టుగా ఉంది. బీసీ, దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి స్పీకర్ పదవికి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా వైసీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.
undefined