చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

First Published | Nov 2, 2023, 12:19 PM IST

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆహార అలవాట్ల గురించి తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు.  ఆహార అలవాట్లతో పాటు  ఫిట్ నెస్  విషయమై   చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ కారణంగానే  అరవై ఏళ్ల వయస్సులో చంద్రబాబు పాదయాత్ర ఇబ్బంది లేకుండా కొనసాగించారు.

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  70 ఏళ్లు దాటినా ఫిట్ ఉంటారు.   1995 నుండి  ఆయన ఆహార అలవాట్లలో మార్పు చేసుకున్నారు. అప్పటి నుండి  ఇప్పటివరకు  అదే  మెనూను పాటిస్తున్నారు.  ఏడు పదుల వయస్సు దాటినా ఆయన  ఫిట్ గా ఉండడానికి కఠినమైన  ఆహారపు అలవాట్లు, యోగా కారణంగా చెబుతున్నారు

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

1995 తర్వాత  చంద్రబాబునాయుడు  మాంసాహరం తినడం మానేశారు.  కంటి సమస్య నెలకొనడంతో పరిమితంగా చేపలు తినడం  గత ఐదేళ్లుగా  ప్రారంభించారు. 

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

ఐదేళ్ల క్రితం వరకు  చంద్రబాబుకు  కంటి సంబంధమైన ఇబ్బందులు కూడ లేవు.  కంటి చూపు కొద్దిగా తగ్గడంతో డాక్టర్ల సూచన మేరకు  ఆహారపు అలవాట్లలో  కొన్ని మార్పులు చేశారు.  మూడు మాసాల క్రితం ఎడమ కంటికి  కాటారాక్ట్ ఆపరేషన్ జరిగింది. కుడి కంటికి కాటరాక్ట్  ఆపరేషన్ చేయాలని వైద్యులు  చంద్రబాబుకు సూచించారు.

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

 చంద్రబాబు  భోజన అలవాట్లు చాలా కఠినంగా ఉంటాయి. ఆయన తీసుకొనే భోజనంలో  అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.  నూనె అతి తక్కువగా వాడుతారు.

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

ఉదయం పూట  రాగి, జొన్న, సజ్జలతో కలిపిన జావను చంద్రబాబు తాగుతారు.కోడిగుడ్డులోని పచ్చసొన తీసివేసి వేసిన ఆమ్లెట్ ను తీసుకుంటారు. దీంతో పాటు ఏదో ఒక సీజనల్ పండును తీసుకుంటారు.

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

మధ్యాహ్నం పూట  రాగి, జొన్నతో తయారు చేసిన భోజనం తీసుకుంటారు.  కప్పు మాత్రమే భోజనం ఉంటుంది.  కప్పు అన్నంతో పాటు కప్పు కర్రీ ఉంటుంది. రాత్రి పూట  తేలికగా జీర్ణం అయ్యే  ఆహారం తీసుకుంటారు. చపాతీ, పుల్క తీసుకుంటారు.తప్పనిసరి పరిస్థితుల్లో రైస్ తీసుకుంటారు.  

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

సాయంత్రం పూట  గ్లాస్ పాలు తీసుకుంటారు.  రాత్రి పూట పార్టీ సమావేశాల్లో పాల్గొనాల్సిన పరిస్థితులు వస్తే  అదనంగా గ్లాస్ పాలు తాగుతారు.

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

చంద్రబాబుకు  ఏ రోజున ఏ పుడ్ అందించాలనే విషయమై  వంటలు చేసే వారికి ముందుగానే జాబితా చేరుతుంది.  టేబుల్ స్పూన్ లో సగం మాత్రమే నూనెను వినియోగిస్తారు.  ఉప్పు,కారం కూడ  చాలా మితంగా వాడుతారు.  

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

పరిమితంగా భోజనం చేయడం,  కఠినమైన ఆహారపు అలవాట్ల కారణంగా అరవై ఏళ్ల వయస్సులో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వస్తున్నా మీకోసం పాదయాత్ర నిర్వహించారు.ఈ పాదయాత్ర సమయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు రాకపోవడానికి  ఆహారపు అలవాట్లే కారణంగా వైద్యులు చెబుతున్నారు.

చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....

ఆహారపు అలవాట్లతో పాటు ఉదయాన్ని యోగా, వ్యాయామం చేస్తారు.  పాదయాత్ర సమయంలో కూడ చంద్రబాబు వ్యాయామం మానలేదు. 

Latest Videos

click me!