రాజమండ్రి టు ఉండవల్లి : సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు..జననీరాజనాలు..

Published : Nov 01, 2023, 06:58 AM IST

జైలునుంచి బెయిలుపై విడుదలైన చంద్రబాబు ప్రయాణం 14 గంటలపాటు సుదీర్థంగా సాగింది. ఆయన ఈ రోజు ఉదయం ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. 

PREV
16
రాజమండ్రి టు ఉండవల్లి : సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్న చంద్రబాబు..జననీరాజనాలు..
chandrababu

ఉండవల్లి : మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మద్యంతర  బెయిలుపై విడుదలైన చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని తన నివాసానికి బయలుదేరారు.  ఈ ప్రయాణం  సుదీర్ఘంగా కొనసాగింది. 

26
chandrababu

14.30 గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45గంటల ప్రాంతంలో ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. నిర్విరామంగా సాగిన సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబునాయుడు అలసిపోయారు.

36

చంద్రబాబు ఉండవల్లి నివాసానికి రాగానే నాయకులు, కార్యకర్తలు, అమరావతి రైతులు ఉద్విగ్నానికి గురయ్యారు. జై చంద్రబాబునాయుడు, లాంగ్ లివ్ చంద్రన్న అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడు ఇంటివద్దకు అమరావతి రైతులు, మహిళలు భారీగా చేరుకున్నారు. 

 

46

అమరావతి మహిళలు ఉండవల్లిలోని ఆయన నివాసం వద్ద గుమ్మడికాయల దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పట్టారు. దారిపొడవునా 45ఏళ్ల రాజకీయ జీవితంలో కనీవినీ ఎరుగని రీతి చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

56

అర్థరాత్రి వేళ, తెల్లవారుజామున సైతం వేలసంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. రాజమండ్రి జైలు వద్ద నుంచి నిన్న సాయంత్రం 4.15గంటలకు బయలుదేరిన టిడిపి అధినేత చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం చేశారు. 

66
chandrababu naidu

ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగడంపై చంద్రబాబు పోలీసులను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించగా అభిమానులు పెద్ద ఎత్తున రావడంతోనే జాప్యం జరుగుతోందని వారిని ఒత్తిడి చేస్తే శాంతిభద్రత సమస్య వస్తుందని పోలీసులు తెలిపారని సమాచారం. 

click me!