ఇంట్లోకి వెళ్లగానే చంద్రబాబు చేసిన మొదటి పని ఇదే... భువనేశ్వరి భావోద్వేగం

Arun Kumar P | Published : Nov 1, 2023 10:06 AM
Google News Follow Us

రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి నిన్న సాయంత్రమే విడుదలైన చంద్రబాబు నాయుడు ఇవాళ తెల్లవారుజామున ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నారు. ఆయనను చూడగానే భార్య భువనేశ్వరి భావోద్వేగానికి లోనయ్యారు. 

17
ఇంట్లోకి వెళ్లగానే చంద్రబాబు చేసిన మొదటి పని ఇదే... భువనేశ్వరి భావోద్వేగం
Chandrababu

గుంటూరు : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు 53 రోజుల జైలుజీవితం తర్వాత ఇంటికి చేరుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ నుండి నిన్న సాయంత్రమే విడుదలైన చంద్రబాబు సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే చంద్రబాబు చేసిన మొదటిపని కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని పూజించడం. స్వామివారి ఎదుట కొబ్బరికాయ కొట్టి భార్య భువనేశ్వరితో కలిసి దండం పెట్టుకున్నారు. 
 

27
Chandrababu

పూజ అనంతరం భార్య, కోడలు, మనవడితో చంద్రబాబు ముచ్చటించారు. భర్తను చూడగానే ఒక్కసారిగా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. అలాగే మనవడు దేవాన్ష్ కూడా తాతతో గడిపాడు. ఇలా కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం తనకోసం వచ్చిన టిడిపి నాయకులను కలిసారు. ఇంటివద్దకు భారీగా చేరుకున్న టిడిపి శ్రేణులకు చంద్రబాబు అభివాదం చేసారు. 

37
chandrababu naidu

ఇక వైద్య పరీక్షల కోసం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆయనకు విమానాశ్రయంలోనే స్వాగతం పలికేందుకు తెలంగాణ టిడిపి నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు సిద్దమయ్యారు. హైదరాబాద్ లో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడే తన నివాసానికి వెళ్లనున్నారు. చంద్పాటు భువనేశ్వరి కూడా హైదరాబాద్ రానున్నారు. 

Related Articles

47
chandrababu

ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 53 రోజులు రిమాండ్ ఖైధీగా వున్నారు చంద్రబాబు. చాలా ప్రయత్నాల తర్వాత ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో నిన్న(మంగళవారం) సాయంత్రం 4.15 గంటలకు జైలునుండి బయటకు వచ్చారు. 

57
Chandrababu Naidu

జైల్లోంచి బయటకు రాగానే మనవడు దేవాన్ష్ ను చూసి చంద్రబాబు బావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే మనవడిని దగ్గరకు తీసి హత్తుకున్నారు. అనంతరం కోడలు బ్రహ్మణి, బామ్మరిది బాలకృష్ణతో పాటు మిగతా టిడిపి నాయకులందరినీ పలకరించారు. అనంతరం అక్కడినుండి రోడ్డుమార్గంలో ఉండవల్లి నివాసానికి బయలుదేరారు. 

67
chandrababu

చంద్రబాబు కోసం టిడిపి శ్రేణులు రోడ్డుపైకి కాన్వాయ్ పై పూలవర్షం కురిపించారు. పసుపు జెండాలు చేతబట్టి చంద్రబాబు కోసం అర్ధరాత్రి వరకు వేచిచూసారు. మహిళలు కూడా చంద్రబాబును చూసేందుకు రోడ్డుపైకి చేరుకున్నారు. ఇలా ప్రజల నీరాజనాల మద్య చంద్రబాబు కాన్వాయ్ చాలా నెమ్మదిగా సాగింది. దాదాపు 14.30 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇవాళ తెల్లవారుజామును 5.45 గంటలకు  చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. 

77
chandrababu

చంద్రబాబు ఇంటికి రాగానే భార్య భువనేశ్వరితో పాటు కుటుంబసభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. స్వయంగా భువనేశ్వరే కొబ్బరికాయతో చంద్రబాబుకు హారతిపట్టారు. అనంతరం పండితులు కూడా గుమ్మడికాయతో హారతిపట్టి చంద్రబాబుకు దిష్టితీసారు. ఇలా ప్రజల నీరాజనాల మధ్య ఇంటివరకు... కుటుంబసభ్యుల ఆత్మీయతల మధ్య ఇంట్లోకి చేరుకున్న చంద్రబాబు మొదట వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నారు. 

Read more Photos on
Recommended Photos