భారత దేశంలోనే అత్యున్నత రాష్ట్రపతి పదవికోసం జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానమైన పోలింగ్ ప్రక్రియ నేడు దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఇలా ఏపీ అసెంబ్లీలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మొట్టమొదటి ఓటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసారు. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు సీతారాం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్ కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనిత, ధర్మాన ప్రసాదరావు, విడదల రజిని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, సీదిరి అప్పలరాజు, పీడిక రాజన్నదొర తదితరులు కూడా ఓటుహక్కును ఉపయోగించుకున్నారు.