ఏపీలో అమరావతి రచ్చ: చంద్రబాబు మీటింగ్ కు పోటీగా రైతులు సమావేశం

First Published Dec 5, 2019, 11:42 AM IST

రాజధాని రైతులు సైతం అమరావతిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్ లో చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే అందుకు పోటీగా అమరావతిలోనే రైతులు సమావేశం నిర్వహించడం విశేషం. 
 

ఏపీ రాజకీయాల్లో మరోసారి అమరావతి కేరాఫ్ అడ్రస్ గా పొలిటికల్ వార్ నడుస్తోంది. అమరావతి వేదికగా రైతులు, టీడీపీ పోటాపోటీగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇరుపక్షాల సమావేశాలతో అమరావతి ఒక్కసారిగా హీటెక్కుతోంది.
undefined
ఇకపోతే నవ్యాంధ్ర రాజధానిపై వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో విజయవాడలో కన్వెన్షన్ సెంటర్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశానికి అఖిలపక్షాలను ఆహ్వానించింది టీడీపీ.
undefined
వైయస్ఆర్ కాంగ్రెస్ మినహా 17 రాజకీయ పార్టీలకు టీడీపీ ఆహ్వానం పంపింది. రాజధాని నిర్మాణం, ఉపాధి కల్పన, సంపద సృష్టి, అలాగే చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా టీడీపీ సమావేశంలో చర్చించనున్నారు.
undefined
ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో పర్యటించారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రైతుల్లో చీలక నెలకొంది. కొందరు రైతులు వైసీపీకి అనుకూలంగా మరికొందరు చంద్రబాబుకు అనుకూలంగా విడిపోయారు.
undefined
చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ వైసీపీ వర్గీయులు ఆయన కాన్వాయ్ పై చెప్పులు, రాళ్లతో దాడులు చేశారు. అంతేకాదు అడుగడుగునా చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.
undefined
రాజధానిలో జరుగుతున్న పరిణామాలను చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు రూ. 9వేల కోట్లు ఖర్చు చేసిన విషయాలను వాస్తవాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది.
undefined
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరగబోయే రౌంట్ టేబుల్ సమావేశానికి జనసేన పార్టీతోపాటు సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా పార్టీ ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే బీజేపీ హాజరవుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
undefined
ఇదిలా ఉంటే రాజధాని రైతులు సైతం అమరావతిలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ కన్వెన్షన్ సెంటర్ లో చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తే అందుకు పోటీగా అమరావతిలోనే రైతులు సమావేశం నిర్వహించడం విశేషం.
undefined
ఓ వైపు రాజధానిలో తమకు చంద్రబాబు సీఎంగా చేసిన అన్యాయాన్ని అఖిలపక్షం ముందు ఉంచుతామని రాజధాని గ్రామాల్లోని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని - వాస్తవాలు పేరుతో 29 గ్రామాల రైతుల ఆధ్వర్యంలో తుళ్లూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు.
undefined
రైతులు నిర్వహించే సమావేశానికి రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఆర్డీయే పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
undefined
ఈ సమావేశంలో భూసేకరణలో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు, ప్రభుత్వానికీ తెలియజేస్తామని కొందరు రైతులు స్పష్టం చేస్తున్నారు. గ్రామ కంఠాలు, అసైన్డ్ భూములు, కౌలు రైతులు, కూలీల సమస్యలు పరిష్కరించకుండా మాజీ సీఎం చంద్రబాబు వ్యవహరించారని రైతులు ఆరోపిస్తున్నారు.
undefined
తూళ్లూరు వేదికగా జరిగే ఈ సమావేశంలో అన్ని అంశాలను వివరించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు ఒక వర్గం రైతులు. ఇకపోతే రైతులు నిర్వహిస్తున్న సమావేశం వెనుక అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది.
undefined
వైసీపీయే ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని అయితే దానికి రైతుల సమావేశంగా చెప్పుకుంటున్నారని సమాచారం. మొత్తానికి రాజధానిపై అధికార, ప్రతిపక్ష పార్టీల్లో మరోసారి రచ్చ మెుదలైందని చెప్పుకోవచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ సమావేశాలతో రాజధానిపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
undefined
click me!