ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సెల్‌ఫోన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఆత్మహత్య కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
undefined
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు హైద్రాబాద్‌లోని తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆత్మహత్యకు పాల్పడడానికి ముందే కోడెల శివప్రసాదరావు 24 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు.ఎవరితో ఫోన్‌లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
undefined
సోమవారం నాడు సాయంత్రం నుండి కోడెల శివప్రసాదరావు ఉపయోగించే సెల్‌ఫోన్ ప్రస్తుతం కన్పించడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఫోన్ ను సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటల నుండి స్విచ్చాఫ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
undefined
కోడెల శివప్రసాదరావు కాల్‌డేటాను కూడ పోలీసులు పరిశీలిస్తున్నారు.కొంత కాలంగా కోడెల శివప్రసాదరావు ఎవరితో పోన్లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
undefined
కొంత కాలంగా కోడెల శివప్రసాదరావుపై నమోదైన కేసుల గురించి ఆయన తీవ్రంగా మనోవేదనకు గురైనట్టుగా ఆయన కుటుుంబసభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం వేధింపులకు పాల్పడినందునే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చంద్రబాబునాయుడు కూడ ఆరోపించారు.
undefined
ఇదిలా ఉంటే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కోసం ఉపయోగించిన వైరుతో పాటు ఆత్మహత్య చేసుకొన్న సమయంలో కోడెల శివప్రసాదరావు వేసుకొన్న దుస్తులను కూడ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.
undefined
కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొన్న సమయంలో షర్ట్, పంచెతో ఉన్నారు. హెడ్‌జోన్ ఫ్రాక్చర్ తో కోడెల శివప్రసాదరావు మృతి చెందినట్టుగా పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ఉస్మానియాకు చెందిన ప్రోఫెసర్లు సోమవారం నాడు సాయంత్రం పోస్టు మార్టం నిర్వహించారు.
undefined