నన్ను ఆపితే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా: జగన్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

First Published Dec 5, 2019, 12:34 PM IST

రైతులు కష్టాలను తెలుసుకుందామని తాను పర్యటిద్దామనుకుంటే తనను ఆపాలని చూస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తనను ఆపాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చోనని జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్.   

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. తనను ఆపాలని చూస్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ హెచ్చరించారు. జగన్ ఆర్నెళ్ల పాలన అంతా చంద్రబాబు ఇళ్లు కూల్చడం, కాంట్రాక్టులు రద్దు చేయడమే తప్ప ఇంకేమీ లేదన్నారు.
undefined
చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డును సందర్శించిన పవన్ కళ్యాణ్ టమోటా రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. టమోటా రైతుకు ఎందుకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని నిలదీశారు. అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఆర్నెళ్ల కాలంలో రైతులు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
undefined
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ఇళ్లు కూల్చడం, గత ప్రభుత్వ హామీలను రద్దు చేయడం ఇవే ఆలోచనలు తప్ప రైతుల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ నిలదీశారు.
undefined
జగన్ దృష్టి అంతా చంద్రబాబు ఇళ్లు కూల్చేద్దాం, రద్దులు చేద్దాం అన్న చందంగానే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రైతుకు అండగా ఉండాలన్న ఆలోచన ఏనాడు వైసీపీ ప్రభుత్వానికి గానీ, ఎమ్మెల్యేలకుగానీ జగన్ కు గానీ రాలేదన్నారు.
undefined
టమోటా రైతు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ను ఎప్పుడు తిడదామా అని ఆలోచిస్తూ రైతులను పట్టించుకోకపోతే చెట్టుకు కట్టేసి రైతుల పొలాలను దున్నిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
undefined
టమోటా రైతులకు గిట్టుబాటు ధరలపై త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో రైతుల గిట్టుబాటు ధరపై చర్చ జరగకపోతే తానే రైతుల పక్షాన ఉద్యమిస్తానని తెలిపారు.
undefined
రైతుల సమస్యలను అడిగి తెలుసుకుందామని తాను ప్రయత్నిస్తే తనను ఆపాలని చూస్తారా అంటూ నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. తనను ఆపడమంటే వైసీపీ తన కుర్చీ తాను కూల్చుకున్నట్లేనని స్పష్టం చేశారు.
undefined
రైతులు కష్టాలను తెలుసుకుందామని తాను పర్యటిద్దామనుకుంటే తనను ఆపాలని చూస్తారా అంటూ నిప్పులు చెరిగారు. తనను ఆపాలని చూస్తే చేతులు ముడుచుకుని కూర్చోనని జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్.
undefined
ఇకపోతే బుధవారం మధ్యాహ్నాం మార్కెట్ యార్డు సందర్శనకు పవన్ కళ్యాణ్ కు అనుమతి నిరాకరించారు అధికారులు. దాంతో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. మార్కెట్ యార్డు సందర్శనకు ఎవడి అనుమతులు కావాలని నిలదీశారు. మీ బోడి పర్మిషన్లుతనకు అక్కర్లేదన్నారు. మదనపల్లి మార్కెట్ యార్డు పర్యటనను ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు.
undefined
తాము భయపడటానికి మేకలం కాదని సింహాలమని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు తనను ఎంత ఆపితే అంత దూసుకు వెళ్తానని స్పష్టం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ తనకు రెండు చిటికెలంత అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్.
undefined
ఇకపోతే పవన్ కళ్యాణ్ గురువారం మదనపల్లిలోని మార్కెట్ యార్డులో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుమతులు కోరారు. అయితే మార్కెట్ యార్డ్ కమిటీ కార్యదర్శి అందుకు అనుమతి ఇవ్వలేదు. టమోటా సీజన్ మెుదలైన నేపథ్యంలో పవన్ పర్యటన ఇబ్బంది కలిగిస్తుందని ఆరోపిస్తూ అనుమతి నిరాకరించారు.
undefined
పవన్ కళ్యాణ్ మార్కెట్ యార్డ్ విజిట్ ను మార్కెట్ కమిటీ కార్యదర్శి వ్యతిరేకించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో తాము మార్కెట్ యార్డును సందర్శించి తీరుతామని రైతులతో మాట్లాడతామని తెలిపారు. ధర్నా చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
undefined
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పవన్ కళ్యాణ్. మార్కెట్ యార్డు సందర్శనకు ఎవడి అనుమతులు కావాలని నిలదీశారు. మీ బోడి పర్మిషన్లుతనకు అక్కర్లేదన్నారు.
undefined
అయితే పవన్ కళ్యాణ్ వార్నింగ్ తో మదనపల్లి మార్కెట్ యార్డు కమిటీ చివరికి వెనక్కి తగ్గక తప్పలేదు. పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. దాంతో గురువారం ఉదయం11.30 గంటలకు పవన్ కళ్యాణ్ మార్కెట్ యార్డులో పపర్యటించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
undefined
click me!