రాజకీయాల్లోనూ పవన్ ట్రెండ్ ఫాలో కావట్లేదు.... సెట్ చేస్తున్నాడు..!! ఎలాగో తెలుసా?

First Published | Jul 15, 2024, 8:02 PM IST

 పవన్ కల్యాణ్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీని సత్కరించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలోనూ మానవత్వం పరిమళించేలా వ్యవహరించారు. ఇంతకూ ఆయన ఏం చేసారంటే...   

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కల్యాణ్ ... ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో గట్టిగా వినిపిస్తున్న పేరు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన అన్నిసీట్లలో విజయం సాధించింది పవన్ సారథ్యంలోకి జనసేన పార్టీ. ఇలా వందశాతం సక్సెస్ రేట్ తో పార్టీని గెలిపించుకోవడమే కాదు... మిత్రపక్షాలు టిడిపి, బిజెపి విజయంలోనూ పవన్ కీలకపాత్ర పోషించారు. గతంలో 151 సీట్లతో గెలిచిన వైసిపిని 11 సీట్లకు పరిమితం చేసిన క్రెడిట్ పవన్ కే దక్కింది. దీంతో రీల్ పవర్ స్టార్ కాస్త రియల్ పాలిటిక్స్ లో పవర్ ఫుల్ స్టార్ అయిపోయారు. కేవలం రాజకీయాల్లోనే కాదు పాలనలోనూ తనదైన మార్క్ చూపిస్తూ ప్రజల్లో మరింత గొప్పపేరు సంపాదించుకుంటున్నారు పవన్. తాజాగా ఆయన తీసుకున్న ఓ నిర్ణయం అనాధ బిడ్డల ఆకలి తీరుస్తోంది. 

Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మానవత్వం పరిమళించేలా ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు తీసుకురాకుండా కూరగాయలు, పండ్లతో కూడిన బుట్టలు తీసుకురావాలని ఇటీవలే పవన్ సూచించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయనే స్వయంగా జనసేన ఎమ్మెల్యేలకు కూరగాయలు అందించి ఈ కొత్త ట్రెడిషన్ ను ప్రారంభించారు. ఇలా తాను ట్రెండ్ ఫాలో కాను... సెట్ చేస్తాను అనే తన సినిమా డైలాగ్ ను రాజకీయాల్లోనూ నిజం చేసారు పవన్ కల్యాణ్. 

Latest Videos


Pawan Kalyan

అయితే ఇలా జనసేన ఎమ్మెల్యేలకు అందించిన కూరగాయలను పవన్ ఏం చేసారో తెలుసా..? అనాధ బిడ్డల ఆకలిని తీర్చేందుకు ఉపయోగించారు. ఈ కూరగాయల గుచ్చాలతో పాటు ఒక్కో అనాధాశ్రమానికి లక్ష రూపాయల చొప్పున అందించారు. ఇలా రెండు అనాధాశ్రమాల నిర్వహకులు కూరగాయలతో పాటు రెండు లక్షల రూపాయలు అందజేసారు పవన్. ఈ పనితో ఆంధ్రుల మనసులు దోచుకుని మానవత్వాన్ని ప్రదర్శించే విషయంలో మరో మెట్టు ఎక్కేసారు. సహజంగానే పవన్ ను ఆకాశానికెత్తే మెగా ఫ్యాన్స్, జనసైనికులయితే తాజాగా ఆయన చేసినపనికి ఫిదా అయిపోయారు. 
 

Pawan Kalyan

ఇకపై తనను కలవడానికి ఎవరు వచ్చినా ఇలాగే కూరగాయలు, పండ్లు వంటివి తీసుకురావాలని పవన్ మరోసారి కోరారు. శాలువాలు, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు వంటివి వద్దని... వీటివల్ల తనకు గాని, ప్రజలకు గానీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కూరగాయలు, పండ్లతో కొందరి కడుపు నిండుతుందన్నారు. 

Pawan Kalyan

ఇలా జనసేన ఎమ్మెల్యేల సత్కార కార్యక్రమంలో ఇచ్చిపుచ్చుకున్న కూరగాయలను మంగళగిరికి చెందిన ఎస్.కె.సి.బి, షైన్ అనే రెండు అనాధ శరణాలయాలకు అందించారు పవన్. ఇలా కేవలం కూరగాయలు ఇచ్చి పంపించలేనంటూ ఒక్కో అనాధాశ్రమానికి లక్ష రూపాయల చొప్పుల రెండు లక్షల చెక్కులు అందించారు. పవన్ చేసిన ఈ పని తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది... ఆయనపై అభిమానాన్ని మరింత పెంచింది. 
 

Pawan Kalyan

ఇక జనసేనాని పవన్ కల్యాణ్ చేతులమీదుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సత్కారం అందుకున్నారు. అలాగే ఎంపీలు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, వల్లభనేని బాలశౌరి... ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, లోకం నాగమాధవి, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, సుందరపు విజయ్ కుమార్, వంశీకృష్ణ యాదవ్, పంతం నానాజీ, బత్తుల బలరామకృష్ణ, దేవ వరప్రసాద్, గిడ్డి సత్యనారాయణ, బొలిశెట్టి శ్రీనివాస్, పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, మండలి బుద్ధప్రసాద్, ఆరణి శ్రీనివాసులు, ఆరవ శ్రీధర్... ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ లు కూడా పవన్ ఆత్మీయ సత్కారాన్ని అందుకున్నారు.

click me!