విజయవాడ: మంగళవారం కోనసీమ జిల్లా పేరుమార్పును నిరసిస్తూ జరిగిన విధ్వంసానికి జనసైనికులే కారణమంటూ అధికారపార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలను పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. ఇవాళ విజయవాడకు విచ్చేసిన పవన్ కోనసీమ జిల్లా పేరుమార్పు, అమలాపురంలో చోటుచేసుకున్న ఘటనలపై స్పందించారు. వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన హత్యను కవర్ చేసుకోవడానికే కోనసీమలో గొడవలు సృష్టించారని... ఇది కూడా కోడికత్తి లాంటి నాటకమేనని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.