తాడికొండ సర్పంచ్ ఇంటివద్ద దుండగుల హల్ చల్... బండరాళ్లతో కారు ధ్వంసం

Arun Kumar P   | Asianet News
Published : May 20, 2022, 12:58 PM IST

అధికార వైసిపి మహిళా ఎమ్మెల్యే కారుపై గుర్తుతెలియని దుండుగులు బండరాళ్లతో దాడిచేసి ధ్వంసం చేసారు. ఈ  దుర్ఘటన గుంటూరు జిల్లా తాడికొండలో చోటుచేసుకుంది.  

PREV
14
తాడికొండ సర్పంచ్ ఇంటివద్ద దుండగుల హల్ చల్... బండరాళ్లతో కారు ధ్వంసం
thatikonda

గుంటూరు: అధికార వైసిపి సర్పంచ్ కారుపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాడికొండ మహిళా సర్పంచ్ తోకల సరోజిని నరసింహారావు కారుపై దుండుగులు పెద్ద బండరాళ్లను విసిరి ధ్వంసం చేసారు.  
 

24
thatikonda

సర్పంచ్ కుటుంబం నివాసముండే ఇంటిబయటకు అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వీరంగం సృష్టించారు. రోడ్డుపక్కన నిలిపివుంచిన కారుపై రాళ్లతో దాడిచేసి అద్దాలు ధ్వంసం చేసారు. ఇది మందుబాబుల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

34
thatikonda

మద్యంమత్తుల్లో రోడ్డుపై కనిపించిన కారుపై దాడికి పాల్పడ్డారని... ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అయివుండదని భావిస్తున్నారు. అర్ధరాత్రి అలికిడి కావడంతో సర్పంచ్ సరోజిని కుటుంబసభ్యులు బయటకు వచ్చేలోపే దుండుగులు పరారయ్యారు. కారుపై బండరాళ్ళు పడి ధ్వంసమవడాన్ని గమనించిన వారు పోలీసులు ఫిర్యాదు చేసారు. 

44
thatikonda

సర్పంచ్ సరోజినీ కుటుంబసభ్యుల సమాచారం మేరకు ధ్వంసమైన కారును తాడికొండ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సర్పంచ్ నివాసంవద్దగల సిసి కెమెరాల ఆదారంగా దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

click me!

Recommended Stories