జేసీ , కేతిరెడ్డి సవాళ్లతో హైటెన్షన్: తాడిపత్రిలోకి లోకేష్ పాదయాత్ర, పోలీసుల మోహరింపు

First Published | Apr 11, 2023, 10:13 AM IST


తాడిపత్రి  నియోజకవర్గంలోకి  నారాలోకేష్  పాదయాత్ర  ఇవాళ ప్రవేశించింది.  లోకేష్ పాదయాత్ర  ప్రవేశానికి  ముందే తాడిపత్రిలో  టెన్షన్  చోటు  చేసుకుంద.  జేసీ ప్రభాకర్ రెడ్డి , కేతిరెడ్డి పెద్దారెడ్డి  మధ్య  సవాళ్లు  చోటు  చేసుకన్నాయి.

తాడిపత్రిలో హైటెన్షన్

 జిల్లాలోని తాడిపత్రిలో  హైటెన్షన్ చోటు  చేసుకుంది.  తాడిపత్రి ఎమ్మెల్యే  కేతిరెడ్డి  పెద్దారెడ్డి,  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  మధ్య  సవాళ్లు, ప్రతిసవాళ్లతో  ఉద్రిక్తత నెలకొంది.  టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా  లోకేష్  పాదయాత్ర  తాడిపత్రి  అసెంబ్లీ  నియోజకవర్గంలోకి మంగళవారంనాడు  ప్రవేశించింది. 

తాడిపత్రిలో హైటెన్షన్


పాదయాత్రలో  లోకేష్  తనపై  తప్పుడు ఆరోపణలు  చేస్తే  చూస్తూ  ఊరుకొనేది లేదని  తాడిపత్రి  ఎమ్మెల్యే  కేతిరెడ్డి  పెద్దారెడ్డి  వార్నింగ్  ఇచ్చారు.  లోకేష్ క్యాంప్ వద్దకు  వెళ్లి  ఈ విషయమై తేల్చుకొంటానని పెద్దారెడ్డి  ప్రకటించారు.  


తాడిపత్రిలో హైటెన్షన్

పెద్దారెడ్డి  వార్నింగ్ పై  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  అంతే ఘాటుగా  స్పందించారు.  లోకేష్ క్యాంప్ వద్దకు  పెద్దారెడ్డి  వస్తే  పంచెలూడదీసి కొడతారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  కౌంటరిచ్చారు. 

తాడిపత్రిలో హైటెన్షన్

పాదయాత్ర సందర్భంగా  ఆయా  అసెంబ్లీ నియోజకవర్గాల్లో  అధికార  వైసీపీ  ఎమ్మెల్యేల  అవినీతి,  అక్రమాలపై  లోకేష్  ఆరోపణలు చేస్తున్నారు.  అనంతపురం  జిల్లాలోని ధర్మవరం ఎమ్మెల్యే  కేతిరెడ్డి  వెంకటరామిరెడ్డి  అక్రమాలపై  లోకేష్  ఆరోపణలు  చేశారు.  ఎర్రగుట్టను  ఎమ్మెల్యే  ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అంతేకాదు  ప్రభుత్వ భూమిని  కూడా ఆక్రమించుకున్నారని  ఆరోపించారు.  ఈ ఆరోపణలను  ఎమ్మెల్యే  కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి  ఖండించారు. తనపై  లోకేష్ బురదచల్లే  ప్రయత్నం  చేస్తున్నారని  ఆయన   చెప్పారు.

తాడిపత్రిలో హైటెన్షన్

తాడిపత్రి  అసెంబ్లీ నియోజకవర్గంలో  పర్యటించే  సమయంలో  లోకేష్ ఇదే  తరహలో  తనపై  ఆరోపణలు  చేస్తే  తాను  సహించబోనని  కేతిరెడ్డి  పెద్దారెడ్డి  హెచ్చరించారు.  లోకేష్ వద్దకు వెళ్లి  ఆధారాలు  చూపాలని   పట్టుబడుతానన్నారు.  జేసీ బ్రదర్స్   ఇచ్చే సలహాలతో  లోకేష్  తప్పుడు  ఆరోపణలు  చేయవద్దని  కేతిరెడ్డి పెద్దారెడ్డి  కోరారు. 

తాడిపత్రిలో హైటెన్షన్

తాడిపత్రి  అసెంబ్లీ  నియోజకవర్గంలో  జేసీ  ప్రభాకర్ రెడ్డి,  కేతిరెడ్డి  పెద్దారెడ్డి మధ్య  ఉప్పు, నిప్పు మాదిరిా  పరిస్థితి  ఉంది.  దీనికి తోడుగా  ఈ ఇద్దరు  నేతలు  లోకేష్  పాదయాత్రకు ముందే  సవాళ్లు , ప్రతిసవాళ్లు  చేసుకున్నారు.  తాడిపత్రిలో  లోకేష్  పాదయాత్ర  నేపథ్యంో  పోలీసులు భారీ  బందోబస్తు  ఏర్పాటు  చేశారు. ఎలాంటి అవాంఛనీయ  ఘటనలు  చోటు  చేసుకోకుండా  చర్యలు తీసుకుంటున్నారు

తాడిపత్రిలలో హైటెన్షన్

 తాడిపత్రి  నియోజకవర్గంలో జేసీ  ప్రభాకర్ రెడ్డి , కేతిరెడ్డి  పెద్దారెడ్డి  వర్గాల మధ్య  తరుచుగా  ఘర్షణలు  చోటు  చేసుకుంటున్నాయి.  గ్రామాల్లో   శాంతి భద్రతల సమస్యలు నెలకొంటున్నాయి.  ఈ నేపథ్యంలో  ఇరువర్గాలు  ఒకరికొకరు  ఎదురుపడకుండా  పోలీసులు జాగ్రత్లలు తీసుకుంటున్నారు

Latest Videos

click me!