యువగళం: 59 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన నారా లోకేశ్

First Published Jan 31, 2023, 8:58 PM IST

టీడీపీ లీడర్ నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో ఐదో రోజు పూర్తి చేసుకుంది. ఐదో రోజు నాటికి ఆయన 58.5 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కస్తుర్బా స్కూల్ వద్ద నుంచి మళ్లీ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.
 

nara lokesh yuvagalam

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతున్నది.ఈ యాత్ర నేటికి ఐదో రోజు పూర్తి చేసుకుంది. ఐదో రోజు పాదయాత్రతో ఆయన 58.5 కిలోమీటర్ల దూరం నడిచారు. 

nara lokesh yuvagalam

ఐదో రోజు అంటే మంగళవారం ఆయన 14.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఫిబ్రవరి 1న అంటే బుధవారం ఆయన ఉదయం 8 గంటలకు కస్తుర్బా స్కూల్ హాస్టల్‌లో యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు.

nara lokesh yuvagalam

ఉదయం 10.20 గంటల వరకు ఆయన బెల్లుపల్లి క్రాస్‌కు చేరుకుంటారు. అక్కడ ఆయన వాల్మికీ కమ్యూనిటీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఉదయం 11.50 గంటలకు కొలమసాని పల్లె వద్ద గల పెట్రోల్ పంప్ దగ్గర మహిళలతో మాట్లాడుతారు. అనంతరం, మధ్యాహ్నం 1.05 గంటలకు గొల్లపల్లి దగ్గర లంచ్ బ్రేక్ తీసుకుంటారు.

nara lokesh yuvagalam

సాయంత్రం 5.45 గంటలకు నారా లోకేశ్ స్థానికంగా ఉండే ఎస్సీ కమ్యూనిటీ ప్రతినిధులు, నేతలతో సమావేశం అవుతారు. 6.50 గంటలకు రామాపురంలోని ఎమ్మోస్ హాస్పిటల్ ఎదురుగా క్యాంప్‌లో రాత్రి హాల్టింగ్ చేస్తారు.

nara lokesh yuvagalam

కుప్పంలో ఈ నెల 27న ఉదయం ప్రారంభమైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సినీ నటుడి నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.  

nara lokesh yuvagalam

ఉదయం 11గంటలకు  కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత  పాదయాత్ర ప్రారంభించారు. నారా లోకేష్ తో పాటు పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు.  అయితే పాదయాత్ర ప్రారంభమైన గంట గంటన్నర తర్వాత.. ఆయన  సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నది.

click me!