జనసేన పార్టీ మొదలైన నాటి నుంచి పార్టీకి మద్ధతుగా నిలుస్తున్నారు నాగబాబు. ఓవైపు చిరంజీవి పెద్దగా రాజకీయాలపై ఆసక్తి చూపని సమయంలో కూడా నాగబాబు పవన్ కళ్యాణ్ వెన్నంటే నిలిచారు. ఈ నేపథ్యంలోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన భారీ విజయాన్ని అందుకుంది. వందశాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని అందుకుంది.
అయితే నాగబాబు మాత్రం ఎన్నికల బరిలో నిలవలేదు. ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా దానికి నాగబాబు ఆసక్తి చూపలేదని వార్తలు వచ్చాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు అవకాశం కల్పించారు. పొత్తు ధర్మంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ నేత కొణిదల నాగేంద్రరావు (నాగబాబు) నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. మరి నాగబాబు ప్రకటించిన అప్పులు, ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.