Womens Day 2025 : ఈ వీకెండ్ రెండురోజులు సెలవు ఉంటుందా?

Published : Mar 05, 2025, 05:17 PM ISTUpdated : Mar 05, 2025, 05:27 PM IST

International Womens Day 2025 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారంలో వరుసగా రెండురోజులు సెలవు వచ్చే అవకాశాలున్నాయి.  మరి ఏఏ రోజుల్లో సెలవు ఉండనుందో తెలుసా?

PREV
13
Womens Day 2025 : ఈ వీకెండ్ రెండురోజులు సెలవు ఉంటుందా?
International Womens Day 2025

International Womens Day : 2025 లో అప్పుడే రెండు నెలలు పూర్తయ్యాయి... మూడో నెలలో అంటే మార్చిలో అడుగుపెట్టాం. అయితే గత రెండునెలలు విద్యార్థులు, ఉద్యోగులకు భాగానే సెలవులు వచ్చాయి. నూతన సంవత్సర సెలవులతో మొదలై మొన్నటి శివరాత్రి వరకు సెలవులే సెలవులు వచ్చాయి. అయితే ఈ హాలిడేస్ కు కొనసాగింపుగా మార్చిలోనూ సెలవులు వస్తున్నాయి. 

మార్చి 8న అంటే వచ్చే శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండే అవకాశముంది. గతంలో ఈ ఉమెన్స్ డే రోజు మహిళా ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇచ్చారు. అయితే అలాకాకుండా ఈసారి పూర్తిగా హాలిడే ఇవ్వాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.   

యువతులు, మహిళలతో ఉమెన్స్ డే రోజున ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేవలం మహిళా ఉద్యోగులకే కాదు స్కూల్ అమ్మాయిలు, కాలేజీ యువతులు కూడా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే మార్చి 8న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.  

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ ఉమెన్స్ డే సెలవు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ఇటు రేవంత్, అటు చంద్రబాబు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. గతంలో మాదిరిగా మహిళలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తారా లేక అందరికీ సెలవు ఇచ్చేస్తారో చూడాలి. 
 

23
Womens Day Holiday

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రెండ్రోజులు సెలవులు? 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ,తెలంగాణలో సెలవు ఇస్తే మహిళలే కాదు అందరూ ఎగిరి గంతేస్తారు. వారాంతం శని, ఆదివారాలు సెలవులు వస్తే ఉద్యోగులు కుటుంబంతో కలిసి సరదాగా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్చి 8న సెలవుపై  ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇక ఇప్పటికే ఉమెన్స్ డే ను పురస్కరించుకుని కొన్ని చోట్లు మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్స్ ఇస్తున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా ఇవాళ,రేపు(మంగళ, బుధవారం) కాకినాడ జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పాల్గొనేందుకు మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ మార్చి 5, 6 తేదీల్లో సాధారణ క్యాజువల్ లీవ్ ఇచ్చారు.  

ఇలా ఈ వారమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతాయి. కాబట్టి మహిళలు, అమ్మాయిలు ఉమెన్స్ డే వేడుకల్లో పాల్గొనే వెసులుబాటు ఒక్క కాకినాడ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు కల్పించాలని మహిళా, ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  
 

33
International Womens Day 2025

మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? 

చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయల్లో మహిళలు దూసుకుపోతున్నారు...కానీ ఇంకా ఏదో వెలితి. ఇంటినుండి బయట అడుగుపెట్టాలంటే ఎన్నో ఆంక్షల కాలంనుండి అంతరిక్షంలోకి వెళ్లే స్థాయికి మహిళలు చేరుకున్నారు... కానీ ఇంకా ఏదో వెలితి. ఒలింపిక్స్ నుండి క్రికెట్ వరకు, సామాన్య ఉద్యోగుల నుండి సీఈవోల వరకు, వ్యవసాయం నుండి వ్యాపారవేత్తలవరకు మహిళలు ఎంతో ఉన్నతస్థానంలో ఉన్నారు. ఇంకా ఏదో వెలితి. 

మహిళలు ఎన్న విజయాలు సాధించినా, ఎంతెత్తుకు ఎదిగినా ఇంకా పురుషాధిక్య సమాజంలో వారికి సరైన గుర్తింపు  దక్కడం లేదు. ఇంకా చాలామంది ఆడబిడ్డను కనేందుకు ఇష్టపడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందరికీ ఆదర్శంగా ఉండే చిరంజీవి వంటివారు సైతం మగబిడ్డలే తమ వారసులుగా భావిస్తున్నారంటే అమ్మాయిలపై ఇంకా వివక్ష వుందనేది స్పష్టమవుతోంది. 

అయితే సమాజంలో ఆడబిడ్డలపై ఉన్న ఆలోచనలను మార్చి వారు ఎందులో మగవారికి తక్కువకాదు అని తెలియజేయాల్సిన అవసరం ఉంది. మహిళా సాధికారత కోసం ఇంకెంతో కృషి చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు వంటివి ఉపయోగపడతాయి... ఈ  సందర్భంగా మహిళకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో చైతన్యం తీసుకురావచ్చు. 

click me!

Recommended Stories