కాపు నేత ముద్రగడ.. రెడ్డిగా ఎందుకు పేరు మార్చుకున్నారో తెలుసా.? పవన్ కారణమని తెలుసా?

Published : Jul 14, 2026, 08:44 PM IST

Mudragada: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

PREV
13
ప‌ద్మ‌నాభం జీవితంలో కీల‌క సంఘ‌ట‌న

ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు చూసింది. అందులో అత్యంత చర్చనీయాంశమైన ఘటన ఆయన తన పేరును 'ముద్రగడ పద్మనాభ రెడ్డి'గా మార్చుకోవడమే. ఆ నిర్ణయం ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న రాజకీయ పరిణామాలు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.

2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కూటమికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో అక్కడే ఎక్కువ సమయం గడిపారు. ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన ముద్రగడ, ఆయన ఆ ఎన్నికల్లో గెలవరని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, "పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభం కాదు.. ముద్రగడ పద్మనాభ రెడ్డి" అని బహిరంగంగా ప్రకటించారు. ఆ వ్యాఖ్య అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

23
పవన్ విజయం తర్వాత మాట నిలబెట్టుకున్న ముద్రగడ

2024 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముద్రగడ చేసిన ప్రకటన మరోసారి చర్చనీయాంశమైంది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ఆ స‌మ‌యంలో దీనిపై స్పందించిన ముద్రగడ, తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అధికారికంగా పేరు మార్పు కోసం అవసరమైన దరఖాస్తులు సమర్పించి, ప్రభుత్వ గెజిట్ ద్వారా తన పేరును 'ముద్రగడ పద్మనాభ రెడ్డి'గా నమోదు చేయించారు. ఆ తర్వాత నుంచి అధికారిక రికార్డుల్లోనూ అదే పేరు కొనసాగింది.

33
రాజకీయ జీవితంలో ప్రత్యేక అధ్యాయం

ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా కాపు సామాజిక వర్గ హక్కుల కోసం ఉద్యమించిన నేతగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే 2024 ఎన్నికల సందర్భంగా చేసిన సవాల్, అనంతరం తన పేరును అధికారికంగా మార్చుకోవడం ఆయన రాజకీయ జీవితంలో అత్యంత గుర్తుండిపోయే సంఘటనగా నిలిచింది. ఇప్పుడు ఆయన మరణంతో ఆ ఘటన మరోసారి ప్రజల చర్చలోకి వచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories