వైసీపీ పార్టీ కార్యకర్త, నగరి రామానాయుడు కాలనీకి చెందిన నందు అనే వ్యక్తి తన తల్లిదండ్రులు కమలకన్నన్, జయంతి దంపతుల షష్ఠి పూర్తి వివాహ కార్యక్రమంలో హాజరయ్యారు.
ఒకప్పటి అందాల తార, వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా.. ఓ వైపు టీవీలో అలరిస్తూనే.. మరోవైపు.. తన నియోజకవర్గ వాసులకు సేవ చేస్తున్నారు. కాగా.. రోజా.. సోషల్ మీడియాలో సైతం చాలా చురుకుగా ఉంటారు.
25
ఎప్పటికప్పుడు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. మొన్నటికి మొన్న తన భర్త పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్న ఆమె.. తాజాగా తన కార్యకర్త ఇంట్లో జరిగిన శుభకార్యానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
35
Roja function
వైసీపీ పార్టీ కార్యకర్త, నగరి రామానాయుడు కాలనీకి చెందిన నందు అనే వ్యక్తి తన తల్లిదండ్రులు కమలకన్నన్, జయంతి దంపతుల షష్ఠి పూర్తి వివాహ కార్యక్రమంలో హాజరయ్యారు.
45
roja
తన భర్త సెల్వమణితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా దంపతులు.. ఆ షష్ఠి పూర్తి చేసుకునంటున్న దంపతులకు మంగళస్నానం చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు.
55
Rk roja
తన అభిమాని కోరిక మేరకు.. ఆమె ఈ కార్యక్రమానికి హాజరై... వారందరినీ ఆనందపరిచారు. ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా దంపతులకు వారు సన్మానం చేశారు.