ఎవరీ చిలుకూరి శాంతమ్మ :
అమెరికా ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ నియామకం ఖాయమైన నేపథ్యంలో ఆయన భార్య చిలుకూరి ఉష గురించి తెలుసుకునేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. మరీముఖ్యంగా ఉషా తల్లిదండ్రులు, తాతముత్తాతలు ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు... ఇక్కడే పుట్టిపెరిగారు. కాబట్టి ఉషా గురించి తెలుసుకునేందుకు కాస్త ఎక్కువ ఆసక్తి చూపించడంతో పాటే ఆమె బంధువులు గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో చిలుకూరి శాంతమ్మ ఫిజిక్ష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇందులో గొప్ప విషయం ఏముందని అనుకుంటున్నారా? ఆమె ఏ 50, 60 ఏళ్ల వయసులో పనిచేయడం లేదు...ఏకంగా 93 వయసులోనూ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఈ వయసులోనూ శాంతమ్మ తన టీచింగ్ వృత్తిని కొనసాగించడం ఆశ్చకరమే కదా. ఇలా ఉన్నత ఆదర్శాలతో ఇప్పటికి విద్యార్థులను తీర్చిదిద్దే పనిలో వున్న శాంతమ్మ యూఎస్ సెకండ్ లేడి ఉషాకు నాన్నమ్మ వరస అవుతుంది.
ఉషా తండ్రి రాధాకృష్ణ కు శాంతమ్మ సొంత చిన్నమ్మ అవుతుంది. ఉద్యోగనిమిత్త భర్తతో కలిసి విశాఖపట్నంలో స్థిరపడ్డారు శాంతమ్మ. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైరైన ఆమె ప్రస్తుతం విజయనగరంలోని సెంచూరియన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనే ఆమె టీచింగ్ వృత్తిని కొనసాగిస్తున్నారు.