దివిసీమకు మాటిచ్చారు.. రైల్వేలైన్ సాధించుకొచ్చారు : సరిలేరు నీకెవ్వరు అనిపించుకుంటున్న జనసేన ఎంపీ బాలశౌరి

First Published | Nov 6, 2024, 12:26 PM IST

జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి దివిసీమ ప్రజల చిరకాల కోరికను నిజం చేసే ప్రయత్నాల్లో వున్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల కోసం ఆయన అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు. ఆయన కృషికి ఫలితం లభిస్తోంది. 

Balashowry Vallabhaneni

దివిసీమ ప్రజలకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బందరు, రేపల్లె, బాపట్ల రైల్వే లైన్ త్వరలోనే సాకారం కానుంది. ఈ దిశగా మరో కీలక ముందడుగు పడింది. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కుతోంది.

మచిలీపట్నం నుండి రేపల్లె మీదుగా బాపట్ల వరకు 45.81 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణం కోసం ఫైనల్ లొకేషన్ సర్వే (ఎస్ఎల్ఎస్) చేపట్టేందుకు రైల్వే సిద్దమయ్యింది. ఈ మేరకు రైల్వే బోర్డు ఆమోదం లభించగా అధికారికి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. 

మచిలీపట్నం-రేపల్లె మధ్య ఎఫ్ఎల్ఎస్ చేపట్టేందుకు రైల్వే బోర్డు గత ఆగస్ట్ లోనే తెలిపింది. అయితే ఈ రైల్వే లైన్ ను బాపట్ల వరకు పొడిగించాలంటూ ఎంపీ బాలశౌరి రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే రేపల్లె నుండి బాపట్ల వరకు రైల్వే లైన్ వేసేందుకు కూడా ఆమోదం లభించింది. ఈ రైల్వే లైన్  ఫైనల్ లొకేషన్ సర్వేకు తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. 

ఎంపీ బాలశౌరి తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. కృష్ణా జిల్లాలోని తమ ప్రాంతానికి రైల్వే లైన ఎంత అవసరమో పార్లమెంట్ సమావేశాల్లోనే వివరించారు. అలాగే మచిలీపట్నం, రేపల్లె రైల్వే లైన్ కోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎన్నిసార్లు కలిసారు. ఇలా ఆయన చిన్నపాటి పోరాటమే చేసి తన ప్రజల చిరకాల కలను సాకారం చేస్తున్నారు. 
 

Balashowry Vallabhaneni

మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల రైల్వే లైన్ ఉపయోగాలు : 

మచిలీపట్నం-రేపల్లె మధ్య రైల్వే లైన్ ఆ ప్రాంత ప్రజల చిరకాల కల. ఈ రైల్వే లైన్ సాధనకోసం ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. గత పాలకులు ఎంత ప్రయత్నించినా ఈ రైల్వే లైన్ ను సాధించలేకపోయారు. కానీ వల్లభనేని బాలశౌరి ఎంపీగా బాధ్యతలు స్వీకరించాక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రైల్వే లైన్ కోసం అలుపెరగని ప్రయత్నం చేసారు. ఫలితంగానే రైల్వే శాఖ మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల మధ్య నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది... ఇప్పుడు ఆ పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. 

 ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లా కేవలం విజయవాడ రైల్వే స్టేషన్ పైనే ఆదారాపడాల్సి వస్తోంది. ప్రయాణికులయినా, సరుకు రవాణాకు అయినా ఇదే ప్రధానమైనది. దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ నిత్యం రద్దీగా వుంటుంది. అయితే ఈ మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల లైన్ విజయవాడకు ప్రత్యామ్నాయంగా మారనుంది... కాబట్టి  ఆ రైల్వేస్టేషన్ పై భారం తగ్గుతుంది. 

ఇక తీర ప్రాంతంలో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గంగా మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల రైల్వే లైన్ మారనుంది. మచిలీపట్నం పోర్టుకు సరుకు రవాణా చేయడంలో కీలకంగా మారుతుంది. విజయవాడ నుండి కాకుండా ఈ రైల్వే మార్గంలో ప్రయాణం వందల కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. 
 


Balashowry Vallabhaneni

వల్లభనేని బాలశౌరి ప్రయత్నాలు : 

గత ఐదేళ్లు వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా కొనసాగారు. ఆయనపై నమ్మకంతో మరోసారి ఎంపీగా గెలిపించారు ప్రజలు. దీంతో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల రైల్వే లైన్ ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసారు.  

విజయవాడ రైల్వే స్టేషన్ లో రద్దీ గురించి వివరించా దీనికి ప్రత్యామ్నాయంగా మరో రైల్వే లైన్ అవసరమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్,రైల్వే అధికారులను ఒప్పించగలిగారు. దీంతో మచిలీపట్నం  నుండి బాపట్ల వరకు నూతన రైల్వే ఏర్పాటుకు కేంద్రం అంగీకారం లభించింది. ఇలా ఎంపీ బాలశౌరి దివిసీమ ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపారు.  
 
ఈ మచిలీపట్నం‌-రేపల్లె-బాపట్ల రైల్వే లైన్ భవిష్యత్ లో చాలా కీలకంగా మారనుంది. దివిసీమతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని లక్షల మంది ప్రజలకు ప్రతిసారి విజయవాడకు వెళ్లాల్సిన అవసరం వుండదు. ఇతర ప్రాంతాలతో దివిసీమను అనుసంధానం చేయడంలో ఈ నూతన రైల్వే లైన్ ఉపయోగపడుతుంది. 

ప్రధానంగా బందరు పోర్టు అభివృద్ధిలో ఈ నూతన రైల్వే లైన్ కీలకం కానుంది. ఈ రైల్వే లైన్ ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి వివరించి ఎట్టకేలకు సాధించారు ఎంపీ బాలశౌరి. ఇలా మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మాటతప్పని నాయకుడిగా మారారు బాలశౌరి. 

Balashowry Vallabhaneni

మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల రైల్వే లైన్ నిర్మాణం ఎలా సాగనుందంటే...   

మచిలీపట్నం-రేపల్లె-బాపట్ల రైల్వే లైన్ పనులు రెండు సెక్షన్లుగా సాగుతాయి. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు 45.30 కిలోమీటర్ల రైల్వే లైన్ ను ఒక సెక్షన్, రేపల్లె నుంచి బాపట్ల వరకూ 45.81 కిలోమీటర్ల లైన్ మరో సెక్షన్ గా వుంటుంది. ఈ నూతన లైన్ ఏర్పాటు కోసం సర్వే చేపట్టి డీపీఆర్ తయారీకి రైల్వేబోర్డు వేర్వేరుగా ఆదేశాలు జారీ చేసింది. మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్ సర్వే కోసం రూ.1.13 కోట్లు, రేపల్లె-బాపట్లు రైల్వే లైన్ సర్వేకు రూ.1.15 కోట్ల నిధులను కేటాయించారు. సర్వే పనులు పూర్తయ్యాక రైల్వే లైన్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయి. 

Latest Videos

click me!