పాములు పగబడతాయా?.. 37సార్లు కాటేసిందంటే నిజమేనా?..

First Published Dec 1, 2020, 2:52 PM IST

పాములు పగబడతాయా? తనకు హాని చేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని వచ్చిమరీ కాటేసి వెడతాయా? నిజంగా సినిమాల్లో చూపించేదంతా నిజమేనా? ఈ స్టోరీ చదివితే మీకూ ఇలాంటి అనుమానాలే వస్తాయి.

పాములు పగబడతాయా? తనకు హాని చేసిన వ్యక్తిని గుర్తు పెట్టుకుని వచ్చిమరీ కాటేసి వెడతాయా? నిజంగా సినిమాల్లో చూపించేదంతా నిజమేనా? ఈ స్టోరీ చదివితే మీకూ ఇలాంటి అనుమానాలే వస్తాయి.
undefined
ఎందుకంటే ఓ వ్యక్తిని ఏకంగా 37సార్లు పాములు కాటేశాయి. అంతేకాదు కుడివైపు మాత్రమే అదీ కుడికాలు, కుడిచేయి మీద మాత్రమే కాటేస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
undefined
వివరాల్లోకి వెడితే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం పెద్దచల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందిన సుబ్రమణ్యం(42)ను ఏకంగా 37 సార్లు కాటేశాయి. ఈ విషయాన్ని స్థానికులు విచిత్రంగా చెప్పుకుంటారు.
undefined
నిరుపేద కుటుంబానికి చెందిన సుబ్రమణ్యంకు భార్య, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీగా జీవనం సాగించే సుబ్రమణ్యం ఐదో తరగతి చదువుతున్న రోజుల్లో మొదటిసారి పొలం వద్ద పాము కాటేసింది.
undefined
అప్పటి నుంచి పాములు పగబట్టినట్లుగా సుబ్రమణ్యంను వెంటాడుతూ ప్రతి ఏటా ఓ సారి కాటేస్తున్నాయి.
undefined
37 ఏళ్లలో 37 సార్లు సుబ్రమణ్యం కుడి చేయి, కుడి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తుండడం విశేషం.
undefined
ఒకసారి పాము కాటేస్తే కనీసం 10 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. అంతేకాదు చికిత్స కోసం రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ఆస్పత్రికి, మందులకు ఖర్చవుతోంది.
undefined
రెక్కాడితేగానీ డొక్కాడని సుబ్రమణ్యంను నాలుగు రోజుల క్రితం మళ్లీ పాము కాటు వేయడంతో శంకర్రాయలపేటలోని జేఎంజే ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు.
undefined
తన దీనావస్థను గుర్తించి దాతలు, ప్రభుత్వం ఆర్థికసాయం అందజేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు.
undefined
ఈ విచిత్రం వింటే ఓ వైపు సానుభూతి కలుగుతుంది. మరోవైపు చిరంజీవి నటించిన పాత సినిమా పున్నమినాగు గుర్తుకువస్తుంది.
undefined
అందులో చిన్నతనం నుంచే తండ్రి విషం పెట్టి పెంచడంతో పెద్దయ్యేసరికి చిరంజీవి పాములా మారిపోతాడు.
undefined
ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం కూడా అలా మారిపోతాడా అనే వింత ఆలోచనలు కూడా వస్తాయి. ఏదేమైనా పాములిలా పగబట్టినట్టు కాటేయడం మాత్రం వింతల్లో కెల్లా వింత అనే చెప్పాలి.
undefined
click me!