మదనపల్లి కేసు: బస్మమైపోతారు.. వైద్యులకు చుక్కలు చూపించిన పద్మజ

First Published Jan 30, 2021, 11:19 AM IST

ఈ కేసులో తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. ఆ విచారణకు తల్లి పద్మజ పెద్దగా సహకరించకపోయినా.. తండ్రి పురుషోత్తం నాయుడు మాత్రం కొన్ని విషయాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.

మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య కేసు లో ఊహించని ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన తల్లిదండ్రులే తమ ఇద్దరు కూతుళ్లను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన మనకు తెలిసిందే.
undefined
కాగా.. ఈ కేసులో తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని విచారిస్తున్నారు. ఆ విచారణకు తల్లి పద్మజ పెద్దగా సహకరించకపోయినా.. తండ్రి పురుషోత్తం నాయుడు మాత్రం కొన్ని విషయాలు చెబుతున్నట్లు తెలుస్తోంది.
undefined
ఈ క్రమంలో.. మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ‘ తనను తాను కాళికా దేవిగా ఊహించుకొని నా భార్య పద్మజ.. నా పెద్ద కుమార్తె అలేఖ్య(27) ను చంపేసిన తర్వాత ఆమె నాలుక కోసి తినేసింది.’అని చెప్పడం గమనార్హం.
undefined
కాగా.. వాటితోపాటు.. వారి మానసిక పరిస్థితి అంచనా వేసేందుకు.. వైద్యుల వద్దకు పంపగా.. వారికి పద్మజ చుక్కలు చూపించినట్లు తెలుస్తోంది. దేనికి పొంతన లేకుండా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది.
undefined
‘పద్మజ, పురుషోత్తంనాయుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరికి సుమారు నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. వైద్యపరీక్షలు చేశాం. మేం అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పారు. విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల లక్షణాలు వీరిలో ఉన్నాయి. మరింత కౌనెల్సింగ్‌ అవసరం’. అని రుయా మానసిక వైద్యనిపుణులు తేల్చారు.
undefined
రుయా మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్‌ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.
undefined
విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారన్నారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల్లో ఉండే లక్షణాలు వీరిలో ఉన్నాయన్నారు. పద్మజ తండ్రి, మేనత్తలు సైతం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. రుయాలో కస్టోడియల్‌ కేర్‌ లేకపోవడంతో వీరిని విశాఖకు రెఫర్‌ చేసినట్లు వివరించారు.
undefined
తాను మూడోకన్ను తెరిస్తే భస్మమవుతారని వైద్య పరీక్షలకు వచ్చిన పద్మజ రుయా డాక్టర్లను తొలుత బెదిరించారు. వైద్యులు ఒకింత అయోమయానికి లోనైట్లు తెలిసింది.
undefined
click me!