liquor prices drop in andhra pradesh
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీని తీసుకువచ్చి ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవడమే కాదు ధరలను కూడా భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కొన్ని మద్యం బ్రాండ్ల ధరలు భారీగా తగ్గాయి... కొన్ని బ్రాండ్లు క్వార్టర్ పై రూ.50, ఫుల్ బాటిల్ పై 200 వరకు తగ్గాయి. ఇలా మద్యం ధరలు మరోసారి తగ్గడంపట్ల మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తమ బ్రాండ్ ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపి తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం మద్యం షాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయించి కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్ముతారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇలా భారీగా తగ్గినవాటిలో బాలయ్య బ్రాండ్ కూడా వుంది... అదే మాన్సన్ హౌస్. దీంతోపాటు మరో రెండు ప్రముఖ బ్రాండ్ల మద్యం ధర కూడా తగ్గింది. త్వరలోనే మరో రెండు బ్రాండ్ల మద్య ధరలు కూడా తగ్గనున్నట్లు సమాచారం.
liquor prices drop in andhra pradesh
ధరలు తగ్గిన మద్యం బ్రాండ్లు ఇవే :
మాన్షన్ హౌస్ (Mansion House) :
ఈ బ్రాండ్ మద్యం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన వల్ల ఈ బ్రాండ్ కు బాగా పబ్లిసిటీ వచ్చింది.దీన్ని మాన్షన్ హౌస్ కు బదులు బాలయ్య బ్రాండ్ అని సంబోధిస్తారు. తాజాగా ఈ బ్రాండ్ ధర భారీగా తగ్గింది.
ప్రస్తుతం మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర రూ.220 గా వుంది. దీన్ని రూ.190కి తగ్గించారు. అంటే క్వార్టర్ పై 30 రూపాయలు తగ్గించారు. ఇక ఇదే బ్రాండ్ హాఫ్ బాటిల్ ధర రూ.440 గా వుంటే తాజాగా రూ.380కి (రూ.60 తగ్గింపు), ఫుల్ బాటిల్ ధర రూ.870 నుండి రూ.760 (రూ.110 తగ్గింపు) కు తగ్గించారు.
గతంలో టిడిపి అధికారంలో వుండగా అంటే 2019లో వైసిపి అధికారంలోకి వచ్చేవరకు ఈ మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర రూ.110 వుండేది.కానీ వైసిపి ప్రభుత్వం దీన్ని అమాంతం పెంచేసి రూ.300 చేసింది. ఒక్కసారి ఇంతలా ధర పెంచడంపై విమర్శలు రావడంతో రూ.300 నుండి రూ.220 కి తగ్గించారు. గత ఐదేళ్లు ఇదే ధర కొనసాగింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాన్షన్ హౌస్ ధర తగ్గింది.
liquor prices drop in andhra pradesh
రాయల్ ఛాలెంజ్ (Royal Challenge) :
రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ మద్యం ధరలు కూడా తగ్గాయి. ఈ రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి (రూ.20 తగ్గింపు), ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840 (రూ.80 తగ్గింపు) కు తగ్గింది.
యాంటిక్విటి విస్కి (Antiquity Whisky) :
ప్రముఖ మద్యం బ్రాండ్ యాంటిక్విటీ కూడా ధర తగ్గించింది. ఆ బ్రాండ్ విస్కీ ఫుల్ బాటిల్ ధర ప్రస్తుతం రూ.1600గా వుండగా దీన్ని రూ.1400కు తగ్గించారు. అంటే ఈ ఒక్క బ్రాండ్ మందుబాటిల్ పై ఏకంగా రూ.200 తగ్గించారు.
liquor prices drop in andhra pradesh
అన్ని బ్రాండ్లపై కొత్త ధరలు :-
కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ధరలపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరల సవరణపై చర్చిస్తోంది. బాటిల్ మద్యం తయారీకి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పాటు వేరే రాష్ట్రాల్లో అమ్ముతున్న ధరలను పరిశీలిస్తున్నారు. ఈ కమిటీ నివేదికను బట్టి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అయితే ఈ కమిటీ నిర్ణయానికి ముందే ప్రముఖ కంపనీలు మద్యం ధరలు తగ్గిస్తున్నాయి.
గత ఐదేళ్లు ఏపీలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. ఏవేవో కొత్త కొత్త పేర్లతో మద్యం అమ్మేవారు. అంతేకాదు ధరలు కూడా భారీగా పెంచి అమ్మాయి. ఇలా మద్యం విషయంలో వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి... ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఓటమికి ఇదీ ఓ కారణం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చారు. గతంలో తీసుకువచ్చిన కొత్త బ్రాండ్ మద్యానికి బదులు ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.అంతేకాదు ధరలను కూడా తగ్గించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టకున్న కూటమి ప్రభుత్వంపై మందుబాబులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే మరోసారి మద్యం రేట్లు తగ్గించడంతో మద్యం ప్రియులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.