Kia Engine Theft AP: కియా ఇంజిన్లు కొట్టేసిన దొంగలు దొరికారు.. ఇంటి దొంగల పనేనా?

Kia Engine Theft AP: కియా కార్ల ఇంజిన్లు చోరీకి పాల్పడిన దొంగలు ఎట్టకేలకు దొరికారు. దాదాపు నెలరోజుల తర్వాత పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం యర్రమంచి గ్రామంలో ఉన్న కియా పరిశ్రమలో మార్చి 19న కార్ల ఇంజిన్లు 900 వరకు మాయమయ్యాయని పంచాయతీ యాజమాన్యం ఫిర్యాదు చేశారు. ఈ ఘటన బయటకు రాగానే పోలీసులతోపాటు అందరూ షాక్‌కి గురయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 900 వందల ఇంజిన్లు మాయం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసుల విచారణ సాగిందిలా... 

Kia Engine Theft Case Cracked 900 Engines Stolen, 9 Arrested in AP TN Operation in telugu tbr

కియా కార్ల ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిసిన వెంటనే ఏపీ ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణ కొనసాగించింది. అన్ని విధాలుగా విచారిస్తున్న పోలీసు బృందం తమిళనాడుకు చెందిన 9 మందిని అరెస్ట్ చేసింది. అయితే... వారు ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నారా? లేదా గతంలో చేశారా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. వీరి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. 

Kia Engine Theft Case Cracked 900 Engines Stolen, 9 Arrested in AP TN Operation in telugu tbr

వేల కార్లను ఉత్పత్తి చేసే సంస్థలో ఇటీవల ఆడిట్‌ జరగగా.. ఇంజిన్లు పోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నెలరోజులుగా సీసీ కెమెరాలు, తదితర వివరాలను క్షున్నంగా పరిశీలించి 9 మందిని అరెస్టు చేయగా.. వారిని విచారించిన తర్వాత మరింత మంది అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని వెనుక కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. 


Kia Plant

కియాకార్ల ఇంజిన్లు విదేశాల నుంచి ఇండియాకు వస్తాయి. తొలుత చెన్నై పోర్టుకు కార్లు చేరుకుంటాయి అక్కడి నుంచి పరిశ్రమ వద్దకు కంటైనర్లలో తరలిస్తారు. అయితే... చోరీ ఎక్కడ జరిగింది అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. పోర్టు వద్ద జరిగిందా లేదా కంటైనర్లలో వస్తున్న సమయంలో జరిగిందా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

kia cars

కియా వంటి అతిపెద్ద సంస్థలో అతి పెద్ద వ్యవస్థ ఉన్న సంస్థలో ఏకంగా 900 ఇంజిన్లు మాయంకావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇంజిన్లు కంపెనీకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లాయా లేదా.. తెచ్చేటప్పుడే చోరీ జరిగిందా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై విచారణ చేయాలని మౌఖికంగా సంస్థ పోలీసులకు చెప్పగా.. వారు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకున్నారు. అయితే.. చోరీకి పాల్పడింది గతంలో పనిచేసిన ఉద్యోగుల పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కియా ఏర్పాటుకు ఒప్పందాలు జరగగా.. పరిశ్రమ నుంచి 2019 జూన్‌లో తొలికారును మార్కెట్‌లోకి విడుదల చేశారు. అప్పటి నుంచి వినియోగదారుల నుంచి స్పందన కూడా బాగుంది. తాజాగా ఈ అంతర్జాతీయ కార్ల పరిశ్రమలో ఇంజన్లు మాయం అవడం కలకలం రేపింది. అసలు ఈ కారు ఇంజిన్లు ఎక్కడి పంపారు? ఎవరికి విక్రయించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక కియా పరిశ్రమకు విడి భాగాలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తాయి. అయితే.. ఇంజిన్లు మాత్రం చెన్నై పోర్టు నుంచి వస్తాయి. ఈక్రమంలో భారీ స్థాయిలో ఇంజిన్లు పోవడంతో ఎన్ని నెలల నుంచి ఇది జరుగుతోంది అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!