జేసీ ప్రభాకర్ రెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాళ్లకు బొబ్బలను చూసి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.శుక్రవారంనాడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మీడియాతో మాట్లాడారు. యువగళం పేరుతో లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో ప్రవేశించింది. పాదయాత్ర నిర్వహిస్తున్న కాళ్లకు బొబ్బలు వచ్చినట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అన్ని సౌకర్యాలు అనుభవించే జీవితాన్ని వదిలి ప్రజల కోసం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి
పాదయాత్రతో లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చాయన్నారు. లోకేష్ కాళ్లకు బొబ్బలు వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. పాదయాత్రతో లోకేష్ సక్సెస్ అవుతున్నారన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి
పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను చూసి దిగులుపడొద్దని భువనేశ్వరిని కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి.ప్రజల కోసం లోకేష్ యుద్ధం చేస్తున్నారన్నారు. చంద్రబాబు రివెంజ్ అనొదన్నారు. వాళ్లను క్షమిద్దామని పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు అధికారులను మాత్రం వదిలిపెట్టొద్దని ఆయన కోరారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి
మంచి పనులు చేయడం వల్లే చంద్రబాబు ప్రజల మనిషి అయ్యారన్నారు. తమ ఫేస్ వాల్యూతో ఒక్క ఓటు కూడా రాదన్నారు. చంద్రబాబు ఫేస్ వాల్యూ , జగన్ చేస్తున్న తప్పులు మమ్మల్ని గెలిపిస్తాయన్నారు.
ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి
ఈ నెల 11వ తేదీన తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశించింది. లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించడానికి ముందే ఈ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తే సహించబోనని పెద్దారెడ్డి చెప్పారు. లోకేష్ క్యాంప్ వద్దకు వెళ్లి తేల్చుకొంటానని చెప్పారు. అయితే లోకేష్ క్యాంప్ వద్దకు వస్తే పెద్దారెడ్డి పంచెలూడదీసి కొడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటరిచ్చారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి
ఈ ఏడాది జనవరి 27న లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. సుమారు 4 వేల కి.మీ. పాదయాత్ర చేయాలని లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారు.