ఏపీ అప్పుల్లో, జగన్ ఆస్తుల్లో హరీశ్ రావుకు అభివృద్ధి కనిపించలేదా? .. ఆంధ్రా మంత్రులకు సిపిఐ రామకృష్ణ చురకలు..

Published : Apr 13, 2023, 12:36 PM ISTUpdated : Apr 13, 2023, 12:37 PM IST

తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యల మీద విరుచుకుపడుతున్న ఏపీ మంత్రులకు ‘హరీష్ కు అప్పుల్లో అభివృద్ధి కనిపించలేదా..’అంటూ సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చురకలు వేశారు. 

PREV
16
ఏపీ అప్పుల్లో, జగన్ ఆస్తుల్లో హరీశ్ రావుకు అభివృద్ధి కనిపించలేదా?  .. ఆంధ్రా మంత్రులకు సిపిఐ రామకృష్ణ చురకలు..

అమరావతి : ఆంధ్రాలో అభివృద్ధి లేదన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఏపీ మంత్రులకు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చురకలు వేశారు. 

26
YS Jagan Birthday

- ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అభివృద్ధి సాధించిన విషయం హరీష్ రావుకు తెలీదా?
- భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఆస్తులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా?
- అదానీకి ఏపీలోని పోర్టులు, విద్యుత్ ఒప్పందాలు, వేలాది ఎకరాల భూములు కట్టబెట్టి అదానీని అభివృద్ధి చేయటం కనపడలేదా?
-కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మెడలువంచి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పి, మడమ తిప్పటం గమనించలేదా?
- ఇన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా ఏపీలో అభివృద్ధి లేదని హరీష్ రావు చెప్పటం హాస్యాస్పదం... అంటూ రామకృష్ణ ఆంధ్రా మంత్రులకు వ్యంగ్యంగా చురకలు వేశారు. 

36

కాగా, మంగళవారం తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఏపీ నుంచి  తెలంగాణకు వచ్చి ఇక్కడి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలా వచ్చిన వలస కార్మికులు తెలంగాణలోనే వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు. 

46

ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని హరీష్ రావు అన్నారు.  ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, హైదరాబాదే కాకుండా ఇతర ప్రాంతాల్లో రోడ్లు, ఇతర సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో కూడా మీ అందరికీ బాగా తెలుసు’’ అని  కామెంట్ చేశారు. 

56

కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపడుతుందని.. వీటిని వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు కాకుండా కేవలం తెలంగాణలోనే ఓటుహక్కు ఉండేలా చూసుకోవాలని వలస కార్మికులకు సూచించారు. 

66

botsa

botsaదీనిమీద వివాదం చెలరేగింది. ఏపీ మంత్రులు హరీష్ రావు మీద విరుచుకుపడ్డారు. మంత్రి సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణలు కౌంటర్లతో విరుచుకుపడ్డారు. ఏపీ సమాజం కుటుంబ పాలనను అంగీకరించదంటూ అప్పలరాజు చురకలు వేయగా.. మీ సంగతి మీరు చూసుకోండంటూ బొత్స వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వీరి వ్యాఖ్యల మీదే సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చురకలు వేశారు. 

click me!

Recommended Stories