జన గణన, కుల గణన గురించి విన్నాం... ఈ నైపుణ్య గణన ఏమిటి? ఎలా చేస్తారు ?

Published : Aug 08, 2024, 11:35 PM ISTUpdated : Aug 08, 2024, 11:36 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటివరకు జన గణన, కుల గణను చేపట్టడం గురించి విన్నాం.. కానీ చంద్రబాబు సర్కార్ నైపుణ్య గణన చేపడుతుందట. అదెలా చేస్తారో తెలుసా..?

PREV
16
జన గణన, కుల గణన గురించి విన్నాం... ఈ నైపుణ్య గణన ఏమిటి? ఎలా చేస్తారు ?
Skill Censes

Skill Censes : మీరు జనగణన గురించి వినుంటారు... కుల గణన గురించి వినుంటారు... కానీ నైపుణ్య గణన గురించి విన్నారా..? ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఈ గణన చేపట్టనుంది... ఇందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. రాష్ట్రంలోని యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ గణన చేపడుతున్నట్లు లోకేష్ తెలిపారు. 

26
Skill Censes

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నైపుణ్య గణనకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై చర్చించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఇప్పటివరకు ఇందుకోసం జరిగిన ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు.  

36
Skill Censes

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... స్కిల్ సెన్సెస్ ప్రక్రియ గురించి వివరించారు. నిర్దేశిత సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వివరాలను సేకరించడంతో పాటు ఆన్ లైన్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో వున్న యువత కూడా వివరాలు అందించే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలా యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందడం ద్వారా వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని లోకేష్ పేర్కొన్నారు. ఇదే స్కిల్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. 

46
Skill Censes

అయితే మొదట రాష్ట్రంలోని ఓ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని నైపుణ్య గణన చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వివరాల సేకరణ ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు. మరింత మెరుగైన ఫలితాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ను కూడా ఉపయోగించాలని అధికారులకు లోకేష్ సూచించారు. 

56
Skill Censes

స్కిల్ సెన్సెస్ లో భాగంగా యువతకు ఏ రంగంలో నైపుణ్యం వుందో గుర్తిస్తామని లోకేష్ తెలిపారు. అనంతరం స్కిల్ డెవలప్ మెంట్ లో భాగంగా ప్రఖ్యాత సంస్థలతో శిక్షణతో పాటు సర్టిఫికేట్ కూడా అందిస్తామన్నారు. ఇలా ఆయారంగాల్లో యువతకు ఉపాధి అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలతోపాటు naukri.com, LinkedIn వంటి పోర్టల్స్ ద్వారా మెరుగైన అవకాశాలను పొందే అవకాశాలు వుంటాయన్నారు. 

66
Skill Censes

యువతలో నైపుణ్యాలను తెలుసుకుని వాటిని డిజిటలైజ్ చేస్తామని... తద్వారా వారికి మెరుగైన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పించడమే స్కిల్ సెన్సెస్ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇవ్వాలని, యువతను చైతన్యవంతం చేయాలని సూచించారు. సర్వే అంశాలు సాధ్యమైనంత సులభంగా ఉండేలా చూడాలని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో జరిగే సమావేశంలో విధివిధానాలు ఖరారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. 

Read more Photos on
click me!

Recommended Stories