ఎపి అసెంబ్లీలో మహిళా శక్తి ఇదే: ఒక్కరు టీడీపి, 13 మంది వైసిపి

First Published May 25, 2019, 6:30 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. అత్యధికంగా 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇకపోతే ఈసారి 14 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. అత్యధికంగా 151 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇకపోతే ఈసారి 14 మంది మహిళలు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.
undefined
అయితే వీరిలో 13 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాగా ఒకరు మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నారు. వైయస్ జగన్ ఈసారి అత్యధికంగా మహిళలకు సీట్లు కేటాయించారు. అయితే వారిలో 13 మంది గెలుపొందారు.
undefined
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా నగరి నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన ఆమె అసెంబ్లీలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో కూడా వైయస్ జగన్ ఆమెకే టికెట్ ఇవ్వడంతో రెండోసారి కూడా పోటీ చేసిన ఆమె ఘన విజయం సాధించి అసెంబ్లీలో మరోసారి అడుగుపెట్టబోతున్నారు.
undefined
అటు గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత సైతం ఈసారి గెలుపొందారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈమె ఇద్దరు మాజీమంత్రులను ఓడించి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
undefined
మేకతోటి సుచరితపై జనసేన పార్టీ అభ్యర్థి మాజీమంత్రి రావెల కిషోర్ బాబు, టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు మూడో స్థానానికి పరిమితం కాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ద్వితీయ స్థానంలో నిలిచారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ పై 7398 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు
undefined
మరోవైపు గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన విడదల రజనీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. ఈమె గెలుపు ఒక రికార్డు అని చెప్పుకోవాలి. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
undefined
గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవి సైతం అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రాజధాని సమీప నియోజకవర్గమైన తాడికొండ నుంచి పోటీ చేసిన ఈమె తన సమీప ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పై ఘన విజయం సాధించారు.
undefined
ఇకపోతే అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. కళ్యాణ దుర్గం నియోజకవర్గం నుంచి ఉషశ్రీ చరణ్ తోపాటు శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సైతం అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
undefined
శింగనమల ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జొన్నలగడ్డ పద్మావతి సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిపై గెలుపొందారు. బండారు శ్రావణిపై 46, 462 ఓట్ల మెజారిటీతో ఆమె ఘన విజయం సాధించారు. జొన్నలగడ్డ పద్మావతి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.
undefined
ఇకపోతే కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కేవీ ఉషశ్రీచరణ్ సైతం తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వరనాయుడుపై 19,896 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
undefined
అటు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కంగాటి శ్రీదేవి ఘన విజయం సాధించారు. ఏకంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబును ఓడించి రికార్డు సృష్టించారు. అంతేకాదు కేఈ శ్యాంబాబుపై 42,065 ఓట్ల మెజారిటితో గెలుపొందడం విశేషం.
undefined
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తానేటి వనిత సైతం మరోసారి గెలుపొందారు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తానేటి వనిత తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితపై 25వేలకు పై చిలుకు ఓట్లతో భారీ విజయం సాధించారు.
undefined
తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మీ ఘన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై 39106 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
undefined
విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే పాడేరు నియోజకవర్గానికి చెందిన భాగ్యలక్ష్మీ ఈఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈమె తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై 42,804 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు
undefined
అటు విజయనగరం జిల్లా విషయానికి వస్తే పాముల పుష్ఫశ్రీవాణి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. కురుపాం నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసిన పాముల పుష్పశ్రీవాణి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నరసింహ థాట్రాజ్ పై 26, 602 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
undefined
చివరగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఈసారి చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. పాలకొండ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వి.కళావతి రెండోసారి కూడా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి నిమ్మక జయకృష్ణపై 17,980 ఓట్ల మెజారిటీతో గెలుపొంది రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మంత్రి వర్గంలో చాన్స్ పై ఆశగా ఎదురుచూస్తున్నారు.
undefined
శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న మరో మహిళా నేత రెడ్డి శాంతి. పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రెడ్డి శాంతి తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణపై 15, 551 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
undefined
ఇకపోతే తెలుగుదేశం పార్టీ తరపున మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ సైతం తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానీ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
undefined
మెుత్తానికి ఏపీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు చట్టసభలలో హల్ చల్ చేయబోతున్నారు. 13 మంది అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. సో వైసీపీలో మహిళారాజ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుందన్నమాట.
undefined