PRP : చిరంజీవిని కాపీకొట్టిన విజయసాయి రెడ్డి.. రెండు పార్టీలు పీఆర్పీలే.. జెండా, ఎజెండా ఒక్కటే

Published : Nov 11, 2026, 12:57 PM IST

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్తపార్టీని ప్రకటించారు. ఈ పార్టీ పేరే కాదు జెండా ఎజెండా కూడా గతంలో చిరంజీవి నడిపిన ప్రజారాజ్యం పార్టీ మాదిరిగానే ఉన్నాయి. దీంతో రాజకీయంగా చిరంజీవిని విజయసాయి రెడ్డి కాపీ కొడుతున్నారా? అనే చర్చ మొదలయ్యింది.

PREV
14
విజయసాయి రెడ్డి పార్టీ ఇదే..

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే మరో కీలక ప్రకటన వెలువడింది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్తపార్టీ పెట్టారు... తన పార్టీ పేరును 'పరివర్తన రాజనీతి పార్టీ (PRP) గా ప్రకటించారు. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు, అజెండాను కూడా ప్రకటించారు వైసిపి పార్టీని వీడి ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన సొంతంగా పార్టీ పెట్టి ఒక్కసారిగా సంచలనం సృష్టించారు.

24
విజయసాయి చిరంజీవినే కాపీకొట్టారా?

ప్రస్తుతం కాపీ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు జనాల్లో బాగా పాపులర్ అయిన పార్టీ పేర్లను ఇప్పుడు వాడుకునే ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణలో ఇదే జరిగింది... భారత రాష్ట్ర సమితి (BRS) నుండి బయటకు వచ్చిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన పార్టీ పెట్టారు. ఇప్పుడే సేమ్ ఇదే ఫార్ములాను ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అప్లై చేశారు విజయసాయి రెడ్డి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి ఇవాళ (నవంబర్ 11, బుధవారం) కొత్తపార్టీని ప్రకటించారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (PRP) పెడితే ఇదే పేరు కలిసివచ్చేలా ఇప్పుడు విజయసాయి పరివర్తన రాజనీతి పార్టీ (PRP) పెట్టారు. దీంతో రాజకీయంగా విజయసాయి రెడ్డి చిరంజీవిని కాపీ కొట్టారనే ప్రచారం జరుగుతోంది. కేవలం పార్టీ పేరు కాదు విజయసాయి పార్టీ జెండా, ఎంజెండా కూడా చిరంజీవి పార్టీని పోలి ఉన్నాయి.

34
పిఆర్పి జెండా, ఎజెండా సేమ్ టు సేమ్

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ జెండాను పోలినట్లే విజయసాయి రెడ్డి పరివర్తన రాజనీతి పార్టీ జెండా కూడా ఉంది. చిరంజీవి పార్టీ జెండాలో తెలుపు, ఆకుపచ్చ రంగు మధ్యలో సూర్యుడు ఉంటే విజయసాయి రెడ్డి పార్టీ జెండాలో కాషాయం, తెలుగు రంగు మధ్యలో చక్రం ఉంది. ఇలా రెండు పిఆర్పి జెండాలు ఒకేలా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

ఇక విజయసాయి రెడ్డి పిఆర్పి పార్టీ ఎజెండా కూడా చిరంజీవి పిఆర్పిని పోలి ఉంది. సామాజక న్యాయం నినాదాన్ని తన పార్టీ ఎజెండాగా విజయసాయి ప్రకటించారు... ఇదే గతంలో చిరంజీవి పార్టీ ఎజెండా. సామాన్య ప్రజలు, యువతలో నాయకత్వ లక్షణాలను తట్టిలేపుతాను... ప్రతి సామాజిక వర్గంలోని నాయకులను ప్రోత్సహిస్తాను.. సామాజిక న్యాయానికి అసలైన అర్థం చెబుతాను అంటున్నారు విజయసాయి… అంటే సామాజిక న్యాయమే తన పార్టీ ఎజెండా చెబుతున్నారు.

44
పిఆర్ఫి సీఎం అభ్యర్థి ఎవరో తెలుసా?

విజయవాడలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో విజయసాయి రెడ్డి ఆసక్తికర ప్రకటన చేశారు. తాను పిఆర్పి పార్టీని ముందుండి నడిపిస్తాను... నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాను... కానీ ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ లేదని విజయసాయి ప్రకటించారు. పిఆర్పి ముఖ్యమంత్రి అభ్యర్థి సామాన్య ప్రజలనుండే వస్తాడనేలా విజయరెడ్డి కామెంట్స్ ఉన్నాయి. ఏపీలో రెండు పార్టీలు, రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి ముగింపు పలుకుతానని... ప్రజలకు రాజకీయాలను చేరువ చేస్తానని విజయసాయి రెడ్డి ప్రకటించారు.

Read more Photos on
click me!

Recommended Stories