ఈ ప్రాంతాల్లో అల్ల‌క‌ల్లోల‌మే.. ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు

Published : Aug 19, 2026, 07:00 AM IST

IMD Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణలోని ఉత్తర జిల్లాలతో పాటు ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

PREV
15
తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక

తెలంగాణలో ఆగస్టు 20 వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ప్రత్యేక అప్రమత్తత అవసరం అని అధికారులు సూచించారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాలకు సమీపంలో ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.

25
ఆగస్టు 20 తర్వాత కూడా వర్షాలు కొనసాగే అవకాశం

ఆగస్టు 20 నుంచి 25 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కొనసాగనున్నాయి. అయితే ఈ వ్యవధిలో ప్రత్యేక వాతావరణ హెచ్చరికలు జారీ చేయలేదని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల పరిస్థితి ఉంటుందని చెప్పలేము. ప్రాంతాన్ని బట్టి వర్షాల తీవ్రత మారే అవకాశం ఉంది. కొన్ని చోట్ల సాధారణ జల్లులు ప‌డ‌నుండ‌గా, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ప్ర‌త్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వాతావరణ మార్పులను గమనిస్తూ స్థానిక అధికారులు ఇచ్చే సూచనలను పాటించడం మంచిది.

35
ఏపీలో కోస్తా ప్రాంతాలకు గాలులు, వర్షాల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లోనూ రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 18 రాత్రి నుంచి 20 ఉదయం వరకు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఆగస్టు 20 నుంచి 23 వరకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో కూడా అక్కడక్కడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.

45
ఆగస్టు 23 నుంచి వాతావరణం ఎలా ఉంటుంది?

ఆగస్టు 23 ఉదయం నుంచి 25 ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ రెండు రోజులకు సంబంధించి ప్రత్యేక హెచ్చరికలు ఏవీ లేవని అధికారులు స్పష్టం చేశారు. దీంతో భారీ వర్షాలపై ప్రస్తుతం ప్రత్యేక ఆందోళన అవసరం లేదని భావించవచ్చు. అయినప్పటికీ వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉండటంతో స్థానిక సూచనలను ఎప్పటికప్పుడు గమనించడం అవసరం.

55
ప్రజలు, రైతులు ఏం చేయాలి?

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిది. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. ప్రయాణాలు చేసే వారు స్థానిక వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకోవాలి. వాతావరణ సమాచారాన్ని పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన మౌస‌మ్ యాప్ ద్వారా తాజా వర్ష సూచనలను తెలుసుకోవచ్చు. పిడుగులు, మెరుపులకు సంబంధించిన హెచ్చరికల కోసం డామిని (Damini) యాప్ ఉపయోగపడుతుంది. రైతులకు పంటలు, వ్యవసాయ పనులకు సంబంధించిన వాతావరణ సూచనలు తెలుసుకునేందుకు మేఘ‌దూత్ (Meghdoot) యాప్ అందుబాటులో ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories