IMD Rain Alert: రానున్న మూడు రోజులకు సంబంధించి వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ విడుదల చేసింది. తెలంగాణలో ఎండ ఎక్కువగా కనిపించనున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో వానలు వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో వచ్చే 48 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉంది. 24వ తేదీ నాటికి ఈ వ్యవస్థ వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. ఆ తరువాత ఇది మరింత బలపడుతూ నైరుతి బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు.
25
తెలంగాణలో మూడు రోజులు పొడి వాతావరణం
తెలంగాణపై ప్రస్తుతం తూర్పు, ఈశాన్య దిశల నుంచి తక్కువస్థాయి గాలులు వీస్తున్నాయి. దీంతో బుధవారం, గురువారం, శుక్రవారం రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో రాత్రి సమయంలో 2–3°C తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణలో గురువారం చల్లని గాలులు ఎక్కువగా వీచే అవకాశాలున్నాయి.
35
ఉత్తరాంధ్రలో ఎండ, దక్షిణ కోస్తాలో వర్ష సూచనలు
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తరాంధ్రలో వచ్చే మూడు రోజులు ప్రధానంగా పొడి వాతావరణం కనిపిస్తుంది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఒక్కోచోట తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాయలసీమలో వచ్చే రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి వానలు లేదా జల్లులు పడవచ్చు. శుక్రవారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు వచ్చే అవకాశం ఉంది. మేఘాలు, గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడా కనిపించవచ్చు.
55
జాగ్రత్తలు తప్పనిసరి
రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ గాలి, మెరుపులు సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. పొలాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అల్పపీడనం బలపడే కొద్దీ వాతావరణంలో మార్పులు మరింత స్పష్టమవుతాయని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వాతావరణ శాఖ వెల్లడించింది.