వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన జగన్.. ఆటగాడిలా మారిన సీఎం (ఫోటోలు)
Siva Kodati |
Published : Jul 09, 2023, 09:05 PM IST
డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని సీఎం ప్రారంభించారు.
డాక్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం రూ.26.12 కోట్లను ఖర్చు చేసింది.
24
YS Jagan
పులివెందులలోనే హాకీ టర్ఫ్ కోర్ట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండవ హాకీ టర్ఫ్ కోర్ట్ కావడం విశేషం.
34
YS Jagan
హాకీ టర్ఫ్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, ఆర్చరీ బ్లాక్, హ్యాండ్ బాల్, ఖో ఖో, ఇండోర్ బ్యాట్ మింటన్ కోర్టులను కూడా సీఎం జగన్ ప్రారంభించారు.
44
YS Jagan
పులివెందులలో ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కార్యక్రమానికి మంత్రి అంజాద్ భాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు.