బిగ్ బాస్ సామాన్యుల భవిష్యత్తు ఈ ముగ్గురి చేతుల్లో.. క్రేజీ సెలెబ్రిటీలు రంగంలోకి..

Published : Aug 13, 2025, 11:21 PM IST

బిగ్ బాస్ తెలుగు 9 ప్రధాన షోకి ముందు అగ్ని పరీక్ష పేరుతో ప్రీ షో నిర్వహించనున్నారు. దీనికోసం ముగ్గురు క్రేజీ సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు. 

PREV
15
త్వరలో బిగ్ బాస్ తెలుగు 9

తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఈసారి 9వ సీజన్‌తో మరింత ఆసక్తికరంగాప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటిలాగే ఈ సీజన్ కూడా గ్లామర్, డ్రామా, సస్పెన్స్‌తో నిండివుండబోతోంది. కానీ ప్రత్యేకత ఏమిటంటే ఈసారి హౌస్‌లోకి సామాన్యులకూ అవకాశం ఉంది.

25
కామన్ మ్యాన్ ఎంట్రీకి రికార్డ్ రెస్పాన్స్

కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగు పెట్టాలని వేలాది మంది కలలు కనడం కొత్త కాదు. కానీ ఈసారి స్పందన మరీ ఎక్కువైంది. ఇప్పటివరకు 20 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. ఆ జాబితా నుండి 40 మందిని సెలెక్ట్ చేశారు.

35
అగ్నిపరీక్ష – ఫైనల్ సెలెక్షన్ రౌండ్

ఎంపికైన 40 మందికి హౌస్‌లోకి వెళ్లేముందు ఒక కఠినమైన టాస్క్‌ – అగ్నిపరీక్ష ఎదురవుతుంది. ఈ టాస్క్‌ ద్వారా అసలు ఎవరికి హౌస్‌లో చోటు దక్కుతుందో తేలుతుంది.

45
గ్రాండ్ మాస్టర్స్‌గా ముగ్గురు సెలెబ్రిటీలు 

అగ్నిపరీక్షకు జడ్జీలుగా ముగ్గురు బిగ్‌బాస్‌ పాపులర్ సెలెబ్రిటీలు  ఎంపికయ్యారు. బిగ్‌బాస్‌ సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్‌ ఓటీటీ నాన్‌స్టాప్ ఛాంపియన్ బింధుమాధవి, సీజన్ 1 కంటెస్టెంట్ నవదీప్ – ఈ ముగ్గురే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే కామన్ మ్యాన్ లని ఎంపిక చేయబోతున్నారు.

55
హోస్ట్ గా ఆకట్టుకోనున్న శ్రీముఖి

ప్రోమోలో హోస్ట్ శ్రీముఖి “మీ డ్రీమ్ స్పాట్‌లైట్ ఇది.. కానీ అంత ఈజీ కాదు”అని చెప్పి సస్పెన్స్ పెంచింది. జడ్జీలు కూడా తమ స్టైల్‌లో వార్నింగ్స్ ఇచ్చారు. అభిజిత్ మైండ్ గేమ్, బింధుమాధవి బ్లాక్-వైట్ థ్రెట్, నవదీప్ ఎంటర్టైన్మెంట్ ప్రామిస్‌ హైలైట్ అయ్యాయి. అగ్నిపరీక్ష ఆగస్ట్ 22 నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజూ హాట్‌స్టార్లో స్ట్రీమవుతుంది. జడ్జీల అంచనాలను దాటగలిగినవారికే బిగ్‌బాస్‌ సీజన్ 9 హౌస్‌లో ప్రవేశం లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories