Heavy Rain Alert : రుతుపవనాలతో జతకలిసిన ద్రోణి.. ఇక ఈ జిల్లాల్లో వర్షబీభత్సమే, ఈ ప్రాంతాల్లో అతలాకుతలమే

Published : Jun 27, 2026, 09:55 AM IST

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి భారీ వర్షాలు కురిపించేందుకు రెడీగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల వాతావరణ విభాగాల ప్రకారం… ఏఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోకి ఎప్పుడో ప్రవేశించాయి... కానీ అవి మందగించడంతో వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు రుతుపవనాలు యాక్టివ్ గా మారాయి... దీనికి ద్రోణి కూడా తోడవడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకో నాలుగైదు రోజులు ఇలాగే భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నారు.

ఇవాళ (జూన్ 27, శనివారం) ఏయే ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలంగాణ, ఏపీ వాతావరణ విభాగాలు ప్రకటించాయి. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాయి... అంటే ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారన్నమాట. ఈ భారీ వర్షాలతో వరదలు సంభవించే అవకాశాలుంటాయి... కాబట్టి లోతట్టు ప్రాంతాలు, నదులు, వాగులు, చెరువుల పరిసర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.

25
నేడు ఏపీలో భారీ వర్షాలు...

రుతుపవనాలు, ​ద్రోణి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో నేడు (జూన్ 27, శనివారం) మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ జల్లులకు అవకాశం ఉందని వెల్లడించారు.

ఇప్పటికే ఏపీలో కొన్నిచోట్ల వర్షం కురుస్తోంది... ఇది మరికొన్ని గంటలు కొనసాగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, గన్నవరం, కైకలూరు, గుడివాడ, ఉయ్యూరు, పెడన, ఏలూరు, ఆకివీడు పరిసర ప్రాంతాల్లో వర్షం పడుతోందని వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్‌, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోనూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. భారీ వర్షాలతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

35
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు...

ఇవాళ (శనివారం) వర్షాలు జోరందుకుంటాయని... రేపు (జూన్ 28, ఆదివారం) మరింత పెరుగుతాయని ఏపిఎస్డిఎంఏ ఎండీ హెచ్చరించారు. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు.

​ఈదురు గాలులు, ఉరుములు వచ్చేటప్పుడు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దు... ​తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు ప్రఖర్ జైన్. ​రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని APSDMA ఎండి సూచించారు.

45
ఈ తెలంగాణ జిల్లాలకు అలర్ట్ జారీ

తెలంగాణలో కూడా వర్షాలు జోరందుకున్నారు. రెండుమూడు రోజులుగా ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడింది... కొన్నిజిల్లాల్లో వర్షాలు కూడా మొదలయ్యాయి. అయితే ఇవాళ (జూన్ 27, శనివారం) ఈ వర్షాలు మరిన్ని జిల్లాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్,వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది తెలంగాణ వాతావరణ శాఖ.

55
నేడు హైదరాబాద్ లో వర్షాలు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రస్తుతం ఆకాశం మేఘాలతో కమ్మేసి చల్లని వాతావరణం కొనసాగుతోంది. ఉదయం కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కూడా కురిశాయి. ఇక మధ్యాహ్నం మరోసారి వర్షాలు మొదలవుతాయని... సాయంత్రం, రాత్రికి మరింత జోరందుకుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది.

ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఇవాళ (జూన్ 27) వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.

Read more Photos on
click me!

Recommended Stories