AP Cabinet: తళతళ మెరిసిపోనున్న ఆంధ్ర‌ రోడ్లు... డేటా సెంటర్, ఐటీ హబ్, కొత్త రోడ్లు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణ‌యాలు

Published : Jul 25, 2025, 12:20 AM IST

Andhra Pradesh cabinet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 50వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెల‌ప‌డంతో పాటు రహదారుల అభివృద్ధికి రూ.1,000 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం ల‌భించింది.

PREV
15
పెట్టుబడులకు కేంద్రంగా మారుతోన్న ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తోందని ప్ర‌భుత్వం పేర్కొంది. దీనికి అనుగుణంగా తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక పాలసీని రూపొందించి మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహానికి తలుపులు తెరచనున్నాయి.

మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిశ్రమలకు పలు రకాల ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. దేశంలో ఇప్పటికే గుజరాత్, తమిళనాడు, యూపీ లాంటి రాష్ట్రాలు ఈ విధానాలతో గొప్ప ఫలితాలు సాధించగా, ఇక ఏపీ కూడా అదే దారిలో ముందుకెళ్లనుంది.

25
విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు

ఈ సమావేశంలో 50వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా విశాఖ న‌గ‌రాన్ని ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయడానికి కంపెనీలు ముందుకు రావడముతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ డేటా సేవల సంస్థ ‘సిఫి’ విశాఖలో రూ.16,466 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన 3.6 ఎకరాల భూమిని మధురవాడలో కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా పరదేశిపాలెంలో సిఫి సంస్థకు 50 ఎకరాలు కేటాయించనున్నారు. పీనం పీపుల్ అనే సంస్థ కూడా 4.45 ఎకరాల్లో 207 కోట్ల రూపాయలతో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

35
ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధికి రూ.1,000 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధి, మరమ్మతులపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రూ.1,000 కోట్లతో 2,000 కిలోమీటర్ల మేర కొత్త రహదారులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. మరో రూ.500 కోట్లతో ఇప్పటికే ఉన్న రోడ్లను వర్షాకాలంలో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలోని రహదారులు జాతీయ ప్రమాణాలకు సమంగా ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంద‌ని తెలిపారు. ఇందుకోసం ప్రతి రహదారిపై సీసీ కెమెరాలు, ఆన్‌లైన్ ట్రాకింగ్ వంటి ఆధునిక పద్ధతులను అమలు చేయనున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

45
పీపీపీ విధానంలో హైవే అభివృద్ధికి ప్రణాళికలు

రాష్ట్రంలోని 12,653 కిలోమీటర్ల హైవేల్లో 20 కి.మీ కన్నా పొడవైన 10,200 కి.మీ రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫేజ్ 1, ఫేజ్ 2 అనే రెండు దశల్లో ఈ రహదారుల అభివృద్ధి జరగనుంది. ఈ క్రమంలో అత్యధిక రద్దీ గల 1,332 కి.మీ రహదారులను ఫేజ్ 1A కింద చేపట్టనున్నారు.

ఇవన్నీ పూర్తయితే రాష్ట్రంలో కనీసం మరో 10,000 కి.మీ అధునాతన రహదారులు అందుబాటులోకి రానున్నాయి. ఇది రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు బూస్టు గా ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలు భావిస్తున్నాయి.

55
రాష్ట్రాభివృద్ధికి మళ్ళీ సింగపూర్‌తో సంబంధాలు

కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సింగపూర్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. తన సింగూర్ పర్యటన ద్వారా రాష్ట్రానికి మళ్ళీ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ దేశంతో మైత్రిని పెంచాలని తెలిపారు.

అంతేకాక, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయమూర్తి నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణపై చర్చించి, ఇకపై కఠినంగా వ్యవహరించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Read more Photos on
click me!

Recommended Stories