మనుషులకు వ్యాపిస్తుందా.?
బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుందని చెప్పడంలో నిజం ఉంది. ముఖ్యంగా కోళ్ల ఫామ్స్‌లో ఉండేవారు. బర్డ్ ఫ్లూ సోకిన కోడిని మాంసాన్ని నేరుగా తాకి.. ఆ చేతితో కళ్లు, నోటిని తుడుచుకోవడం లాంటివి చేస్తే వ్యాపించే అవకాశాలు ఉంటాయి. అయితే పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం అంత్యంత అరుదుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 70 డిగ్రీల వద్ద ఈ వైరస్ చనిపోతుంది. కాబట్టి మనం చికెన్‌ను సుమారు 100 డిగ్రీల వద్ద వేడి చేస్తుంటాం. కాబట్టి ఈ వైరస్ బతికుండే అవకాశాలే ఉండదు.
లక్షణాలు ఎలా ఉంటాయి.?
ఒకవేళ మనిషులకు బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విపరీతమైన జ్వరం ఉంటుంది. తీవ్రమైన గొంతు నొప్పి, పొడిదగ్గు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే తలనొప్పి, ఏ పని చేయకపోయినా అలసట, శరీరమంతా నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీలో నొప్పిగా ఉండడం, మలబద్ధకం లేదా విరేచనాలు, కడుపు నొప్పి, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపించే అవకాశాలు ఉంటాయి.