ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని జెట్ స్పీడ్‌తో ముందుకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా పలు కీల నిర్ణయాలు తీసుకున్నారు..
రాజధాని అమరావతిని ప్రమోట్ చేసేలా ఏపీ ప్రభుత్వం కొత్త బ్రాండ్ అంబాసిడర్లను నియమించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించనున్నారు. నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా సీఎంఓ లేదా ముఖ్యమంత్రి నామినేట్ చేసిన వారినే ఎంపిక చేయనున్నారు.
24
పరిశీలనలో ఉన్న పేర్లు..
అమరావతిని అంతర్జాతీయ స్థాయి వేదికలకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల్లో విస్తృత స్థాయిలో చర్చ జరిగేలా చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ఒకరు చిరంజీవి కాగా మరొకరు సోనూసూద్. గత కొన్ని రోజులుగా సీఎం చంద్రబాబు సోనూ సూద్‌ను కలిసిన సందర్భంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరితో పాటు మరొకరిని కూడా ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
34
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu (File Photo/ANI)
శరవేగంగా నిర్మాణాలు..
దీంతో పాటు అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే భవనాల నిర్మాణానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక సదుపాయాల కోసం టెండర్లను ఆహ్వానించారు. ఈ నెలలోనే ఈ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అమరావతి నగరానికి జాతీయ రహదారులతో కనెక్టివిటీ కల్పించేందుకు రోడ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 7.5 ఎకరల భూ సేకరణ చేపట్టారు.
44
మూడేళ్లలో ఓ రూపు తెచ్చేలా..
వైసీపీ హయాంలో ఆగిన అమరావతిని శరవేగంగా పూర్తి చేయాలని టీడీపీ భావిస్తోంది. రాజధానితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావిస్తున్న ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనుల కోసం భారీగా రుణాలను సేకరిస్తోంది. స్మార్ట్ సిటీగా అమరావతిని నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ. 31వేల కోట్లను రుణంగా తీసుకోవాలనీ సీఆర్‌డీఏ నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే ప్రపంచబ్యాంకు, ఏడీబీల నుంచి రూ. 15 వేల కోట్ల రుణం ఖరారైంది. హడ్కో నుంచి రూ. 11 వేల కోట్ల రుణం మంజూరైంది. రానున్న మూడేళ్లలో వీలైనన్ని ఎక్కువ నిర్మాణాలు పూర్తి చేసి అమరావతికి ఒక రూపు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.