ఒకేరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా రాకుండా ఉండేందుకు పెన్షన్ ఆర్డర్ నంబర్ల ఆధారంగా తేదీలను కేటాయించారు.
నవంబర్ 7న 164 నుంచి 3,250 వరకు నంబర్లు ఉన్నవారు ప్రసాదం తీసుకోవచ్చు.
నవంబర్ 9 నుంచి 13 వరకు 3,251 నుంచి 9,050 నంబర్లు ఉన్నవారికి ప్రసాదం ఇస్తారు.
నవంబర్ 16 నుంచి 19 వరకు 9,051 నుంచి 12,550 వరకు నంబర్లు ఉన్నవారు ప్రసాదం పొందవచ్చు.
నవంబర్ 20న 12,551 ఆ పైన నంబర్లు ఉన్న మిగిలిన వారందరికీ ప్రసాదం ఇస్తారు.
కాబట్టి పెన్షనర్లు తమ నంబర్ చెక్ చేసుకుని కేటాయించిన రోజు మాత్రమే రావాలని టీటీడీ కోరుతోంది.