ఆంధ్ర ప్రదేశ్ లోని వేలేరుపాడు లోని పాత రెడ్డిగూడెంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన సోడే వెంకటేశ్వర్లకు రాధ అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల వెంకటేశ్వర్లు మద్యానికి అలవాటు పడ్డాడు. మద్యం తాగి వచ్చి ఇంట్లో తరచుగా గొడవలు పడుతుండేవాడు. దీనికి తోడు గత కొంత కాలంగా ఒక గిరిజన యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.